Rajamouli | Mahesh Babu : అగ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli ) ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ (RRR) (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఓ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో రాజమౌళి (Rajamouli ) మరింత ఉత్సాహాంగా మహేష్ బాబుతో (Mahesh Babu) సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు.
అగ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli ) ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ (RRR) (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఓ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో రాజమౌళి (Rajamouli ) మరింత ఉత్సాహాంగా మహేష్ బాబుతో (Mahesh Babu) సినిమాను చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఏమంటే.. ఈ సినిమాను రాజమౌళి దాదాపుగా 800 కోట్లతో భారీగా రూపొందించనున్నారట. ఈ సినిమా అడ్వెంచర్ డ్రామా అని, RRR, బాహుబలి కంటే పెద్దదిగా ఉండబోతోందని టాక్. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహేష్ సరసన హిందీ హీరోయిన్ (Alia Bhatt) ఆలియా భట్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి RRRలో సీత పాత్రలో నటించిన (Alia Bhatt) ఆలియా భట్ మరోసారి రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా నటించనుందని అంటున్నారు. ఆ మేరకు (Alia Bhatt) ఆలియా భట్‌తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేష్ బాబు, రాజమౌళితో సినిమా చేయాలని కెఎల్ నారాయణ దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చాలా వీఎఫ్ఎక్స్కు అవకాశం ఉందట.
ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటించారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ ఇరగదీశారు. ఇక మరోవైపు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు జీ5 సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌లు కీలకపాత్రల్లో నటించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.