Home /News /movies /

RAJAMOULI MAHESH BABU DIL RAJU WILL JOIN HANDS WITH RAJAMOULI MAHESH BABU PAN INDIA PROJECT TA

Rajamouli-Mahesh Babu - Dil Raju : మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం రంగంలోకి దిల్ రాజు..

రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి దిల్ రాజు (File/Photo)

రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి దిల్ రాజు (File/Photo)

Rajamouli-Mahesh Babu - Dil Raju : రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి దిల్ రాజు కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. 

    Rajamouli-Mahesh Babu - Dil Raju : రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి దిల్ రాజు కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..   ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా.  ఈ చిత్రాన్ని జనవరి 7న సంక్రాంతికి ఒక వారం ముందుగా విడుదల చేస్తున్నారు. రాజమౌళి  ఇపుడు మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక బాహుబలి కంటే ముందు  మహేష్ బాబు, రాజమౌళి వీళ్లిద్దరు కాంబో పట్టాలెక్కాలి. కానీ వీళ్లిద్దరు తమకున్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కానీ రాజమౌళి .. బాహుబలి (Bahubali) తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ (RRR)సినిమా చేసారు.

    తెలుగులో ఈ  చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలుగుతో పాటు హిందీలో ఈ సినిమా ఫైనల్ కాపీ పూర్తైయింది. త్వరలో సెన్సార్‌కు వెళ్లనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను దుబాయ్‌లో చేయనున్నట్టు సమాచారం.ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌తో పాటు మహేష్ బాబుతో చేయబోయే సినిమాలు సంబంధించిన పనులను చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో జక్కన్నతో చేయబోయే సినిమాకు సంబంధించిన కథను వండివార్చే పనిలో ఉన్నారు.

    Top TRP Telugu Movies: తెలుగు టాప్ టీఆర్పీ రేటింగ్ సినిమాలు.. ’టెంపర్’ టూ ’వకీల్ సాబ్’ వయా బాహుబలి..

    అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని హాలీవుడ్‌ (Hollywood) మూవీ ‘ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే కదా. ఈ జానర్ మహేష్ బాబు (Mahesh Babu)కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. . సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక రాజమౌళి కూడా బాహుబలి నుంచి తన సినిమాలను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

    రాజమౌళి, దిల్ రాజు (Twitter/Photo)


    అందుకే  ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ అవసరం కాబట్టి.. దిల్ రాజు ఈ  సినిమ ా నిర్మాణంలో పాలు పంచుకోనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  తెలుగులో స్టార్ హీరో నటిస్తున్నురా లేకపోతే.. వేరే భాషలకు చెందిన హీరో ఇందులో నటిస్తున్నాడా అనేది చూడాలి.

    Mega Heroes : చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా మెగా హీరోలెవరికి కలిసిరాని ఆ సెంటిమెంట్..


    ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా (Pan India) లెవల్లో తెరకెక్కుతున్నాయి. ఇపుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో కాకుండా ప్యాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు.

    రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
    రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)


    ఇక రాజమౌళి కూడా తాను ఏ సినిమా తెరకెక్కించినా.. ముందుగానే ఆ సినిమా స్టోరీ ఏంటనేది ముందుగానే చెప్పేస్తుంటారు. ఒక విధంగా కథ చెప్పి తన సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం రాజమౌళికి ముందు నుంచే ఓ అలవాటు ఉంది. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు కాంబినేషన్‌లో ఏ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తాడనేది ఇప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైయ్యాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Dil raju, Mahesh babu, Rajamouli, RRR, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు