Rajamouli-Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో మరో క్రేజీ స్టార్.. మరో సారి జక్కన్న ఆర్ఆర్ఆర్ ఫార్ములా..

మహేష్ బాబు, రాజమౌళి

Rajamouli-Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో మరో క్రేజీ స్టార్ హీరో నటిస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

  • Share this:
    Rajamouli-Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో మరో క్రేజీ స్టార్ హీరో నటిస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇపుడు మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ఇక బాహుబలి కంటే ముందు  మహేష్ బాబు, రాజమౌళి వీళ్లిద్దరు కాంబో పట్టాలెక్కాలి. కానీ వీళ్లిద్దరు తమకున్న కమిట్‌మెంట్స్ కారణంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కానీ రాజమౌళి .. బాహుబలి (Bahubali) తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ (RRR)సినిమా చేస్తున్నారు. తెలుగులో ఈ  చిత్రానికి ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీటైంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలుగుతో పాటు హిందీలో తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ కూడా మొదలు పెట్టారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెలుగు,హిందీతో పాటు మొత్తంగా 17 భాషల్లో అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. 

    ఆర్ఆర్ఆర్  సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులతో పాటు మహేష్ బాబుతో చేయబోయే సినిమాలు సంబంధించిన పనులను చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో జక్కన్నతో చేయబోయే సినిమాకు సంబంధించిన కథను వండివార్చే పనిలో ఉన్నారు.

    మహేష్ బాబు, రాజమౌళి (File/Photo)


    అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని హాలీవుడ్‌ (Hollywood) మూవీ ‘ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే కదా. ఈ జానర్ మహేష్ బాబు (Mahesh Babu)కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. . సీనియర్ నిర్మాత కే.యల్. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.ఇక రాజమౌళి కూడా బాహుబలి నుంచి తన సినిమాలను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.  తెలుగులో స్టార్ హీరో నటిస్తున్నురా లేకపోతే.. వేరే భాషలకు చెందిన హీరో ఇందులో నటిస్తున్నాడా అనేది చూడాలి.

    మహేష్ బాబు, రాజమౌళి (File/Photo)


    ఇక మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా (Pan India) లెవల్లో తెరకెక్కుతున్నాయి. ఇపుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో కాకుండా ప్యాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు.

    రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)
    రాజమౌళి, మహేష్ బాబు (mahesh babu rajamouli)


    ఇక రాజమౌళి కూడా తాను ఏ సినిమా తెరకెక్కించినా.. ముందుగానే ఆ సినిమా స్టోరీ ఏంటనేది ముందుగానే చెప్పేస్తుంటారు. ఒక విధంగా కథ చెప్పి తన సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం రాజమౌళికి ముందు నుంచే ఓ అలవాటు ఉంది. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు కాంబినేషన్‌లో ఏ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తాడనేది ఇప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైయ్యాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: