Home /News /movies /

RAJAMOULI MAGNUM OPUS RRR MOVIE CLIMAX BEGUN IN STYLE AND RAM CHARAN JR NTR BOTH JOINED IN SHOOT PK

RRR climax shooting: RRR క్లైమాక్స్ షూట్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్.. ట్వీట్ చేసిన రాజమౌళి..

ట్రిపుల్ ఆర్ క్లైమాక్స్ (RRR climax shoot)

ట్రిపుల్ ఆర్ క్లైమాక్స్ (RRR climax shoot)

RRR climax shooting: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ట్రిపుల్ ఆర్ గురించి కేవలం మన ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలు కూడా వేచి చూస్తున్నాయి. బాహుబలితో ఆయన వేసిన..

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ట్రిపుల్ ఆర్ గురించి కేవలం మన ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలు కూడా వేచి చూస్తున్నాయి. బాహుబలితో ఆయన వేసిన పునాది అలా ఉంది మరి. అందుకే జక్కన్న సినిమా కోసం అంతా కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. అన్ని పరిస్థితులు బాగుండుంటే ఈ పాటికి ట్రిపుల్ ఆర్ మరో రెండు మూడు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది. కానీ కోవిడ్ వచ్చి అంతా నాశనం చేసింది. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ అన్ని జాగ్రత్తల మధ్య జరుగుతుంది. దానికితోడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. మధ్యలో రాజమౌళికి కరోనా రావడం.. నిర్మాత దానయ్య కూడా కోవిడ్ బారిన పడటంతో షూటింగ్ విషయమే అంతా మరిచిపోయారు. ఆ తర్వాత రామ్ చరణ్ కూడా కోవిడ్ బారిన పడటంతో మరిన్ని రోజులు ఆలస్యమైంది ట్రిపుల్ ఆర్ షూటింగ్. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌పై అప్ డేట్ బయటికి వచ్చింది. ట్రిపుల్ ఆర్ చిత్ర షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే చాలా వరకు జరిగింది. ఇప్పటికీ అక్కడ కొన్ని ప్యాచ్ వర్కులు చేస్తూనే ఉన్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ క్లైమాక్స్ ఇప్పుడు మొదలు పెట్టాడు దర్శక ధీరుడు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా ట్రిపుల్ ఆర్ టీం నుంచి వచ్చేసింది.

క్లైమాక్స్ మొదలైంది.. నా రామరాజు, భీమ్ ఇద్దరూ వాళ్లు కోరుకున్న దానికోసం యుద్ధం మొదలు పెట్టారు అంటూ ట్వీట్ చేసాడు రాజమౌళి. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్లైమాక్స్ షూటింగ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటున్నారు. 2022లో ఈ సినిమాను విడుదల చేయనున్నాడు జక్కన్న. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ట్రిపుల్ ఆర్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. మరోవైపు చరణ్‌కు జోడీగా అలియా భట్.. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా క్లైమాక్స్ వరకు షూటింగ్ రావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jr ntr, Ram Charan, RRR, SS Rajamouli, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు