మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు రాజమౌళి లైన్ క్లియర్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రామ్ చరణ్... రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇంకోవైపు ఎన్టీఆర్.. ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభుత్వం సినిమా షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చినా.. హీరో ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం కోవిడ్ 19 విజృంభిస్తోన్న ఈ సమయంలో ససేమిరా అంటున్నారు. దీంతో రాజమౌళి కూడా ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలింగా వాయిదా వేసాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని వచ్చే యేడాది దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ’ఆర్ఆర్ఆర్’ సినిమా వాయిదా పడటంతో రామ్ చరణ్.. తన తండ్రి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న ‘ఆచార్య’ నటించడానికీ ఉన్న అడ్డంకులు తొలిగాయి.

చిరంజీవి రామ్ చరణ్ ఫైల్ ఫోటోస్
ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అత్యంత కీలకం అని చెబుతున్నారు. అందులో వచ్చే ఓ ఎపిసోడ్లో రామ్ చరణ్ నటించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు కథను కీలక మలుపు తిప్పే పాత్ర కావడంతో ఈ సినిమాలో స్టార్ హీరో నటిస్తేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఆచార్యలో రామ్ చరణ్ కథను మలుపు తిప్పే పాత్ర చేస్తున్నాడు. ముందు ఈ పాత్రకు మహేష్ బాబును అనుకున్నారనే వార్తలొచ్చినా కూడా అలాంటిదేం లేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. ముందు నుంచి కూడా తమకు రామ్ చరణ్ ఒక్కడే ఈ పాత్రకు ఆప్షన్ అనుకున్నామని చెప్పాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ కొణిదెల బ్యానర్‌తో కలిసి కాగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఆచార్య సినిమాను నిర్మిస్తున్నాడు.