Vijayendra Prasad - RRR: ఆర్ఆర్ఆర్‌లో ఆ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయట.. రచయత విజయేంద్ర ప్రసాద్..

విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad Photo : Twitter)

Vijayendra Prasad - RRR: ఆర్ఆర్ఆర్‌లో ఆ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా రచయత విజయేంద్ర ప్రసాద్ చెప్పడం ఇపుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే...

  • Share this:
    Vijayendra Prasad - RRR: ఆర్ఆర్ఆర్‌లో ఆ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా రచయత విజయేంద్ర ప్రసాద్ చెప్పడం ఇపుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దర్శకుడిగా రాజమౌళి ఎంత ఫేమసే.. ఆయన సినిమాలకు కథలను సమకూరుస్తూ.. రచయతగా అంతే పాపులర్ అయ్యారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇక బాలీవుడ్ దర్శకులు, హీరోలు కూడా విజయేంద్ర ప్రసాద్ కథల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈయన ఇచ్చిన కథలతోనే  హిందీలో ‘భజరంగీ భాయిజాన్’, మణికర్ణిక’ వంటి సినిమాలు సూపర్ హిట్టైయ్యాయి. ఇపుడు తన తనయుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మరోసారి ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనేదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా స్టోరీ లైన్ రెడీ చేసారు విజయేంద్ర ప్రసాద్. దీనికి రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

    అంతేకాదు చాలా యేళ్ల తర్వాత తెలుగులో నందమూరి, మెగా హీరోలతో తెరకెక్కుతున్న అసలు సిసలైన మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ అనే చెప్పాలి. ఇక ఆర్ఆర్ఆర్‌లో యాక్షన్ సన్నివేశాలకు రాజమౌళి పెద్ద పీట వేసారు. ఈ సీన్స్ కూడా ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని రచయత విజయేంద్ర ప్రసాద్.. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    తనయుడు రాజమౌళితో స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ (File/Photo)


    అంతేకాదు కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటనతో పాటు యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కంట తడి పెట్టిస్తాయని వెల్లడించారు. యాక్షన్ సన్నివేశాల్లో తారక్‌తో పాటు రామ్ చరణ్ ఎంతో ఎమోషనల్‌గా నటించినట్టు చెప్పుకొచ్చారు. థియేటర్స్‌లో ఈ యాక్షన్ సీన్స్ చూస్తున్నపుడు కన్నీళ్లు ఆగవు అని చెప్పారు. ఇక స్టూడెంట్ నెం. 1 సినిమా అపుడే నేను ఎన్టీఆర్ పెద్ద నటుడు అవుతాడని ఊహించాను. అదే నిజమైంది. మరోవైపు ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో తనకు అత్యంత ఇష్టమైన సినిమా ‘అదుర్స్’ అని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. మరోవైపు ఎన్టీఆర్ ‘భజరంగీ భాయిజాన్’ వంటి ఎమోషనల్ సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని విజయేంద్ర ప్రసాద్ తన మనసులో మాట బయటకు చెప్పారు. మరోవైపు ఈయన బాలీవుడ్‌లో ‘సీత’ అనే పౌరాణిక సినిమాకు కథను అందించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ రాముడిగా, రావణాసురుడిగా రెండు పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం.

    RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ (Twitter/Photo)


    ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను  అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. అప్పటి వరకు కరోనా సెకండ్ వేవ్ తగ్గే అవకాశాలున్నాయనేది చిత్ర యూనిట్ వాదన. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కనివిని ఎరుగని రీతిలో జరుగుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ‘ఆర్ఆర్ఆర్’ అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులను సుమారు రూ.325 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇంత భారీగా ధరకు ఓ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పలకడం ఇదే మొదటిసారి అంటున్నారు. దీంతో సినిమా ప్రీరిలీజ్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీ వెర్షన్, ఓవర్సీస్ హక్కులు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజినెస్ మొత్తం సుమారు రూ.900 కోట్లకు చేరిందని సమాచారం. దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాకు జరగని బిజినెస్ ఆర్ ఆర్ ఆర్‌కు జరిగిందని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం విడుదల కావాల్సి ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: