news18-telugu
Updated: November 28, 2019, 10:45 AM IST
రాజమౌళి,అలియా భట్
రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ RRR గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తోన్న ఆలియా భట్‌ను ఇంటికి పంపించి వేసినట్టు సమాచారం. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైయిన ఈ సినిమాలో ఆలియా భట్ షూటింగ్ నిన్నటితో పూర్తి కావడంతో ఆలియా భట్.. సరాసరి ముంబాయి ఫ్లైట్ ఎక్కినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటిస్తోన్న హాలీవుడ్ ఒలీవియా మోరిస్ పై సన్నివేశాలు మాత్రమే మిగిలి వున్నాయి. దాంతో పాటు క్లైమాక్స్ మాత్రమే మిగిలి ఉందని టాక్. ఈ క్లైమాక్స్‌ను ఫిబ్రవరి వల్ల షూటింగ్ కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ముందుగా అనుకున్న 2020 జూలై 30న ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు రాజమౌళి అండ్ టీమ్.

అజయ్ దేవ్‌గణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్
ఇప్పటికే షూటింగ్ కంప్లీటైన పార్ట్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్‌ను సమాంతరంగా నడుస్తోంది. ఈ సినిమాను చరిత్రలో ఇంత వరకు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథాంశానికి దేశభక్తి జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో బాలీవుడ్ నటుడు అగ్రనటుడు అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సమానమైన పాత్ర అని చెబుతున్నారు. జనవరి ఒకటో తేదిన నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 28, 2019, 8:45 AM IST