Home /News /movies /

RAJAMOULI JR NTR RAM CHARAN RRR ROUDRAM RANAM RUDHIRAM MOVIE ANOTHER CRAZY UPDATE ON AJAY DEVGN BIRTHDAY TA

RRR: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో అదిరిపోయే క్రేజీ అప్‌డేట్.. ఈ సారి మాత్రం..

RRRలో అజయ్ దేవ్‌గణ్,ఎన్టీఆర్,రామ్ చరణ్ (Twitter/Photo)

RRRలో అజయ్ దేవ్‌గణ్,ఎన్టీఆర్,రామ్ చరణ్ (Twitter/Photo)

RRR: తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించింది.

    RRR: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. రీసెంట్‌గా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. విల్లు ఎక్కుపెడుతున్న ఫోటోను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు ఆలియా భట్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సీత లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్టు ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించింది. ఏప్రిల్ 2న బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ పుట్టినరోజు సందర్భంగా అజయ్ దేవ్‌గణ్ లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్.. కొమరం భీమ్‌గా నటిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించబోతున్నట్టు ప్రకటించారు. కానీ అజయ్‌ దేవ్‌గణ్ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో నటిస్తురనేది ఆసక్తికరంగా మారింది. ఆర్ఆర్ఆర్‌లో అజయ్‌ దేవ్‌గణ్ ఎలాంటి పాత్ర చేయబోతున్నాడనేది చూడాలి.


    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) సినిమా విషయానికొస్తే.. ఎన్టీఆర్, చరణ్‌,   హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను ఓ శిల్పం చెక్కినట్టు తెరకెక్కిస్తున్నాడు.

    ట్రిపుల్ ఆర్ షూటింగ్ (RRR movie unit)
    ఆర్ఆర్ఆర్ హీరోలతో రాజమౌళి


    ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం కావడం తో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో చిత్ర యూనిట్ బిజీ గా ఉంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటి అలియా భట్ ఇటీవల ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ అయ్యింది. ఇప్పటికే ఆలస్యం కావడంతో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు టీమ్. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్ జోడిగా శ్రియా సరన్ కథానాయికగా నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ajay Devgn, Alia Bhatt, Bollywood news, Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు