‘బాహుబలి 2’ రూట్లోనే RRR.. రాజమౌళి ప్లాన్ అదేనా..

RRR | రాజమౌళి.. ప్రస్తుతం తాను ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం బాహుబలి 2 ప్లాన్‌ను అప్లై చేయాలని చూస్తున్నాడు.. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: October 17, 2019, 7:20 AM IST
‘బాహుబలి 2’ రూట్లోనే RRR.. రాజమౌళి ప్లాన్ అదేనా..
RRR సినిమా ప్రెస్ మీట్లో ఎన్టీఆర్,రామ్ చరణ్,రాజమౌళి
  • Share this:
రాజమౌళి.. ప్రస్తుతం తాను ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం బాహుబలి 2 ప్లాన్‌ను అప్లై చేయాలని చూస్తున్నాడు.. వివరాల్లోకి వెళితే.. బాహుబలి  సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.దానికి తోడు అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్ వంటి చారిత్రక  నేపథ్యం ఉన్న చిత్రం కావడం..ఎన్టీఆర్,రాంచరణ్ కలయికలో వస్తుండటంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాపై  ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను 2020 జూలై 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు గాయాల పాలు కావడంతో ముందుగా అనుకున్న షెడ్యూల్స్ లేట్ అయినట్టు సమాచారం. మరోవైపు రామ్ చరణ్.. సైరా సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ సినిమాకు బ్రేక్ ఇవ్వడం కూడా ఈ సినిమా ఆలస్యం కావడానికి ఒక కారణమని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాజమౌళి.. మరిన్ని యాక్షన్ సన్నివేశాల్ని ఈ సినిమా కోసం యాడ్ చేయాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు సమాచారం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇది వరకు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చూడని రీతిలో ఈ ఫైట్ సీన్స్ తీయబోతున్నట్టు సమాచారం. దీనికి అదనంగా గ్రాఫిక్స్ వర్క్ కారణంగా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

Ram Charan entry into RRR movie shooting while Jr NTR taking rest for next few days pk కొన్ని రోజులుగా రామ్ చరణ్ సైరా సినిమా ప్రమోషన్స్‌తోనే బిజీగా ఉన్నాడు. ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా వరసగా తండ్రి సినిమా పనులతోనే బిజీ అయిపోయాడు మెగా వారసుడు. 200 కోట్లకు పైగా బడ్జెట్.. rrr,#rrr,rrr Twitter,rrr instagram,jr ntr,ram charan,rajamouli,rrr jr ntr ram charan rajamouli,jr ntr twitter,jr ntr instagram,rajamouli twitter,rajamouli instagram,ram charan facebook,ram charan instagram,rrr movie,rrr teaser,jr ntr,ram charan rrr teaser,rrr trailer,rrr movie trailer,ntr,ramcharan,rrr movie teaser,rajamouli rrr,new rrr teaser,rrr ram charan,ram charan,rrr press meet,latest new rrr teaser,rrr movie updates,rrr trailer telugu,rrr teaser mystery,rrr theatrical teaser,rrr ntr,ram charan jr ntr rrr,ramcharan ntr,rrr release date,ramcharn in rrr,rrr ntr movie,rajamouli rrr movie,rajamouli ntr ramcharan,రాజమౌళి,ఎన్టీఆర్,రాంచరణ్,ఆర్ఆర్ఆర్,టాలీవుడ్,ఎన్టీఆర్ రెమ్యునరేషన్,రాంచరణ్ రెమ్యునరేషన్
rrr సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్


గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా కూడా మూడు నాలుగు విడుదల తేదిలు మార్చుకొని 2017 ఏప్రిల్ 28న విడుదల చేసారు. అదే రీతిలో ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా 2021 సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో జక్కన్న ఉన్నట్టు సమాచారం. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులు నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రనటుడు అజయ్ దేవ్‌గణ్ ఇంపార్టెంట్ ప్లే చేస్తున్నాడు.
First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading