Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
Updated: December 10, 2019, 8:52 AM IST
RRR ఫ్యాన్ మేడ్ పోస్టర్స్
‘బాహుబలి’ సినిమాతో దర్శకుడిగా రాజమౌళి ఖ్యాతి దేశ వ్యాప్తంగా పెరిగింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ RRR గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తోన్న ఆలియా భట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు జంటగా నటిస్తోన్న హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్‌పై సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయట. ఇప్పటికే 80 శాతం కంప్లీటైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసే ఉండే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. దీంతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి పోరాడే సీన్స్‌ను పిక్చరైజ్ చేయడం మాత్రమే మిగిలివుందట. ఈ సినిమాలో మొత్తంగా 8 పాటలు ఉండే అవకాశం ఉందట. మూడు సందర్భోచితంగా ఉండే దేశభక్తి పాటలు, మిగిలిన పాటల్లో తారక్, చరణ్‌లకు చెరో రెండు డ్యూయట్స్ ఉంటాయని చెబతున్నారు. సంక్రాంతి లోపలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి.

RRR డిఫరెంట్ టైటిల్స్‌తో కూడిన పోస్టర్స్
మొత్తానికి RRR సినిమాను చరిత్రలో ఇంత వరకు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథాంశానికి దేశభక్తి జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో బాలీవుడ్ నటుడు అగ్రనటుడు అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సమానమైన పాత్ర అని చెబుతున్నారు. జనవరి ఒకటో తేదిన నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే యేడాది జూలై 30న విడుదల చేస్తామని చెబుతున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 10, 2019, 8:52 AM IST