ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీమ్, అల్లూరితో పాటు మరో విప్లవ వీరుడు..

RRR ఫ్యాన్ మేడ్ పోస్టర్స్

ఈ యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలోనే యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ఏదన్న ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. తాజాగా ఈ సినిమాలో అల్లూరి, కొమరం భీమ్ తో పాటు మరో విప్లవకారుడు ఉన్నాడట.

  • Share this:
    ఈ యేడాది తెలుగు చిత్ర పరిశ్రమలోనే యావద్దేశంలో ఉన్న అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించిన ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ఏదన్న ఉందంటే అది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో  రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ  ఫిబ్రవరి నెలఖరికి దాదాపు పూర్తి  కావొచ్చని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ యాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ప్రజా గాయకుడు గద్దర్ ఒక సినిమాలో ఒక విప్లవ గేయాన్ని రాసి పాడుతున్నట్టు ఆర్ఆర్ఆర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా కొమరం భీమ్ పై ఒక పాట రాయమని రాజమౌళి.. స్వయంగా గద్దర్‌ను కలిసి రిక్వెస్ట్ చేసాడట. ఇక గద్దర్ కూడా తనకెంతో ఇష్టమైన కొమరం భీమ్ పై పాట రాసి పాటడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాకు గద్దర్ పాట హైలెట్‌గా నిలస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: