news18-telugu
Updated: November 27, 2020, 2:33 PM IST
రాజమౌళి,చిరంజీవి (File/Photo)
RRR Chiranjeevi | ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలియజేసారు. ఇప్పటికే అల్లూరి సీతరామరాజుగా రామ్ చరణ్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రామరాజు పాత్రకు కొమరం భీమ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ నుండి కొమరం భీమ్ టీజర్‌ను విడుదల చేసారు. రామరాజు వాయిస్ ఓవర్ మొదలైన ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగస్వామి కాబోతున్నారు. అలా అని నటిస్తున్నారంటే పప్పులో కాలేసినట్టే.. ఈ సినిమాలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను తన గాత్రంతో పరిచయం చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చిరంజీవి.. ‘ఘాజీ’తో పాటు ‘రుద్రమదేవి’ చిత్రాలకు తన వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే కదా.

రాజమౌళి,చిరంజీవి (File/Photo)
రాజమౌళి అడగ్గానే ..చిరంజీవి కూడా ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం వివిధ భాషల్లో పాపులర్ నటీనటులతో వాయిస్ ఓవర్ చెప్పించనున్నారు. హిందీ వెర్షన్ కోసం ఆమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు సమాచారం. మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో శివరాజ్ కుమార్, తమిళంలో అజిత్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ సరసన ఒలివియో మోరస్తో పాటు ఐశ్వర్య రాజేశ్ నటించబోతున్నట్టు సమాచారం.అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ నటిస్తోంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 27, 2020, 2:33 PM IST