హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas - Rajamouli: ‘RRR’ ఉండగా ‘రాధే శ్యామ్’ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావ్.. ప్రభాస్ ప్రశ్నకు రాజమౌళి ఏం చెప్పాడంటే..?

Prabhas - Rajamouli: ‘RRR’ ఉండగా ‘రాధే శ్యామ్’ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావ్.. ప్రభాస్ ప్రశ్నకు రాజమౌళి ఏం చెప్పాడంటే..?

Prabhas - Rajamouli: తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి (Rajamouli) మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్లుగా ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. కలిసి మూడు సినిమాలు చేసారు.

ఇంకా చదవండి ...

తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి (Rajamouli) మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 20 ఏళ్లుగా ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. కలిసి మూడు సినిమాలు చేసారు. ఛత్రపతి (Chatrapathi) సినిమాతో మొదటి సారి ఈ కాంబినేషన్ కలిసింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి (Bahubali) పాన్ ఇండియన్ వైడ్‌గా సంచలన విజయం సాధించింది. ఈ సినిమానే ఇప్పటికీ ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. 2000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రంతో ప్రభాస్ రేంజ్ కూడా పెరిగిపోయింది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇండియాను ఊపేసాయి. బాహుబలితోనే ప్రభాస్ కూడా పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. ఆ తర్వాత తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ.. మార్కెట్ ఇంకా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమా మార్చ్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి.

ప్రభాస్ గత పది రోజుల నుంచి తీరిక లేకుండా ప్రమోషన్ చేస్తున్నారు. పలు ఇంటర్వ్యూలతో పాటు అన్ని ఇండస్ట్రీలు తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన్ని రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. చాలా ఆసక్తికరంగా ఈ ఇంటర్వ్యూ అంతా సాగింది. ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో మరింత ఆహ్లాదకరంగా మారింది ఆ ఇంటర్వ్యూ. ఇందులో భాగంగానే ప్రభాస్‌ను ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు రాజమౌళి. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రాజమౌళిని ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఒకటి అడిగారు.

Allu Arjun Pushpa: ఇండియన్ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప’కు మాత్రమే ఈ రికార్డు సాధ్యమైందేమో..?


మీ సినిమా ట్రిపుల్ ఆర్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.. మరి మీ సినిమాను వదిలేసి నా సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు.. అదెలా అంటూ ప్రశ్నించారు. దానికి రాజమౌళి నుంచి అంతే ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. నీ కోసం ఏదైనా చేస్తా.. నువ్వు నా డార్లింగ్.. రెబల్ స్టార్ ప్రభాస్‌పై తన రాజమౌళి తన అభిమానం చూపించారు. ఈ సమాధానంతో ప్రభాస్ కూడా ఫిదా అయిపోయారు. ఈ ఇంటర్వ్యూ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రాధే శ్యామ్ మార్చ్ 11న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ ఈ పాన్ ఇండియన్ ప్రేమకథను తెరకెక్కించారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Prabhas, Rajamouli, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు