ప్రభాస్‌ అంటే అందుకే ఇష్టం... ఈ సినిమాతో మరో మెట్టు ఎదుగుతాడు : రాజమౌళి

Rajamouli : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 19, 2019, 9:27 AM IST
ప్రభాస్‌ అంటే అందుకే ఇష్టం... ఈ సినిమాతో మరో మెట్టు ఎదుగుతాడు : రాజమౌళి
Photo : Facebook
  • Share this:
Rajamouli : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు సుజీత్, హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజమౌళి, వీవీ వినాయక్, కృష్ణం రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ప్రభాస్ గురించి మాట్లాడుతూ..  ‘బాహుబలి’ తీస్తున్న సమయంలోనే ప్రభాస్ తన తర్వాత చిత్రం గురించి ఓ రోజు నా దగ్గర చర్చించాడని చెప్పాడు.  'బాహుబలి' లాంటీ పెద్ద సినిమా చేసిన తర్వాత మళ్లీ పెద్ద డైరెక్టర్‌తో సినిమా చేయకుండా, సుజీత్‌ చెప్పిన కథను నమ్మి ఆయనతో ఈ సినిమా చేశాడు ప్రభాస్. ఇదే నాకు ప్రభాస్‌లో నచ్చిందని.. అయితే.. ఇంత పెద్ద సినిమాను సుజీత్‌ చేయగలడా లేదా.. అని చాలా మందికి అనుమానం ఉండేది. 

View this post on Instagram
 

‪Intense love & action! 👊🏻💕‬ Get ready for the grand #SaahoPreReleaseEvent today at the Ramoji Filmcity from 5 PM onwards! 😎 #30AugWithSaaho . . @actorprabhas @shraddhakapoor @sujeethsign @neilnitinmukesh @arunvijayno1 @sharma_murli @evelyn_sharma ‪@maheshmanjrekar ‬@mandirabedi @apnabhidu @chunkypanday @uvcreationsofficial @bhushankumar @tseriesfilms


A post shared by SAAHO (@officialsaahomovie) on

అయితే.. ఎప్పుడైతే సినిమా ఫస్ట్‌లుక్‌ వచ్చిందో అప్పుెడే సినిమా స్థాయి ఏంటో తెలిసిందని.. టీజర్‌తో అది నిజమైందని అని అన్నారు.. రాజమౌళి. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇటీవల వచ్చిన ట్రైలర్‌తో ఏమన్నా అనుమానాలు ఉంటే అవీ కూడా పటాపంచలయ్యాన్నారు. ఈ సినిమా కోసం సుజీత్ కూడా మంచి ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌లా అదరగొట్టాడన్నారు. అంతేకాకుండా ఈ సినిమా తీయాలంటే నిర్మాతలకు కూడా ఎంతో ధైర్యం కావాలనీ.. 'సాహో' ఆగస్టు 30న విడుదలై  చాలా రికార్డులు సృష్టిస్తుందని.. ఈ సినిమాతో ప్రభాస్‌ మరో మెట్టు ఎదుగుతాడన్నారు రాజమౌళి.
First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు