RRR - Pan India Movie: ‘ఆర్ఆర్ఆర్’కి టిక్కెట్లు ఇచ్చేది అప్పుడే!

Rajamouli got a clarity on pan india movie RRR release date

RRR - Pan India Movie: ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్‌పై ఎట్టకేలకు యూనిట్‌కు ఓ క్లారిటీ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ట్రిపుల్ ఆర్‌కి టిక్కెట్లు కావాలా? ఈ మాట విన‌డానికే ఎంత ఆనందంగా ఉందో అని అనుకుంటున్నారా? నిజంగానే ఆనందంగానే ఉంటుంది. కాక‌పోతే ఆ ఆనందాన్ని ఆస్వాదించాలంటే మాత్రం ఇంకో ఏడాది ఆగాల్సిందే అంటున్నారు మేక‌ర్స్. నిజానికి జ‌న‌వ‌రి 8 య‌ష్ పుట్టిన‌రోజు క‌దా. మ‌రి ట్రిపుల్ ఆర్ ఎందుకు నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది ట్విట్ట‌ర్‌లో? అంటే య‌ష్ కేజీఎఫ్‌ని మించి ట్రిపుల్ ఆర్ ట్రెండ్ కావడానికి రీజ‌న్ ఉంది. ఏంటి అంటే... ట్రిపుల్ ఆర్‌కి అన్నీ క‌లిసొచ్చి ఉంటే జ‌న‌వ‌రి 8న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సింది. కానీ వ‌రుస‌గా సినిమా షెడ్యూల్స్ వాయిదా ప‌డ‌టం, దానికి తోడు కోవిడ్ క‌ష్టాలు... ఇవ‌న్నీ క‌ల‌వ‌డంతో ట్రిపుల్ ఆర్ డేట్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. మేక‌ర్స్ గ‌తంలో జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించిన మాట‌లో వాస్త‌వం లేకుండా పోయింది.

    2021లో మాట‌ను నెరవేర్చుకోలేక‌పోయిన‌ప్ప‌టికీ, 2022లో అయినా మాట నిల‌బెట్ట‌మ‌ని రాజ‌మౌళిని వేడుకుంటున్నార‌ట నిర్మాత దాన‌య్య‌. ఇప్ప‌టికే ఖ‌ర్చు కూడా సినిమా ప‌రంగా భారీగా పెరిగింది. ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. డిసెంబ‌ర్‌లో వ‌రుస‌బెట్టి అప్‌డేట్స్ ఇచ్చిన జ‌క్క‌న్న టీమ్ ఇప్పుడు అస‌లు నోరు మెద‌ప‌డం లేదు. ఈ సంక్రాంతికి ఏమైనా ఇస్తారా? లేకుంటే జ‌నవ‌రి 26కి ఇంకేమైనా ఇస్తారా? అని మాత్రం అభిమానులు ఎదురుచూపులు చూస్తున్నారు. ముందు షూటింగ్ పూర్త‌యితే, త‌ర్వాత వీఎఫ్ ఎక్స్ అస‌లు సిస‌లైన సంద‌డి మొద‌ల‌వుతుంది.



    వీఎఫ్ ఎక్స్ పూర్త‌యితే గానీ సినిమా మీద ఓ అంచ‌నాకు రాలేరు. రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించ‌లేరు. అయినా రాజ‌మౌళి టీమ్ ధైర్యం చేసి మ‌రీ, 2022 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయ‌డానికి ట్రై చేద్దామ‌ని నిర్మాత‌కు భ‌రోసా ఇచ్చిన‌ట్టు టాలీవుడ్‌లో గ‌ట్టిగా మాట‌లు వినిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published: