హోమ్ /వార్తలు /movies /

Pawan Kalyan: ఆలోపు పవన్ కళ్యాణ్ సీఎం కావొచ్చు.. రాజమౌళి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: ఆలోపు పవన్ కళ్యాణ్ సీఎం కావొచ్చు.. రాజమౌళి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

  రాజమౌళితో సినిమా అంటే చాలు.. ఏ హీరో అయిన ఎగిరి గంతేయాల్సిందే. ఇక స్టార్ హీరోలతో సినిమా తీయడం అంటే రాజమౌళికి కూడా ఎంతో ఇంట్రస్ట్. రానా,ప్రభాస్‌తో కలిపి బాహుబలి తీశాడు.ఇక ఇప్పుడు ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు రామ్ చరణ్,జూ ఎన్టీఆర్‌లో ఓకేసారి తెరపై చూపించి ప్రేక్షకుల మదిని మరోసారి గెలుచుకున్నాడు. ఇక రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏ హీరోతో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ప్రిన్స్ మహేష్‌తో కలిసి జక్కన్న సినిమా తీయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో పవర్ స్టార్‌తో రాజమౌళి సినిమా ఎప్పుడని అటు పవన్ ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్‌తో కలిసి సినిమా తీయాలని జక్కన్నకు ఉన్నా.. సమయం మాత్రం అందుకు అనుకూలంగా లేదని చెప్పాలి.

  తాజాగా రాజమౌళి తండ్రి... ప్రముఖ రచయిత కే.విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి పవన్ కళ్యాణ్ తో మాత్రమే చేయాల్సి ఉందని ఆ కాంబో కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనే ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ స్పందించారు. దేనికైనా టైం కలిసి రావాలి అని దర్శకుడికి హీరోకు ఇద్దరికీ అనువైన సమయం దొరికితే ఆ ప్రాజెక్ట్ సెట్ అవుతుందన్నారు. అయితే ముందు మహేష్ బాబు సినిమా అయిపోయిన తర్వాతనే రాజమౌళి తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తారని చెప్పారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒకవేళ సినిమా చేయాల్సి వస్తే అప్పటి వరకు ఆయన ఖాళీగా ఉంటారా లేదా అని నమ్మకం కూడా తనకు లేదన్నారు విజయేంద్ర ప్రసాద్. ఒకవేళ అప్పటి లోపు అనుకుంటే అప్పుడు ఆయన ఆయన సీఎం కావొచ్చేమో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

  అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా చేయడం అంత సాధ్యమయ్యే విషయం కాదన్నారు రాజమౌళి తండ్రి. ఆయనతో సమానంగా మ్యాచ్ అయ్యే మరొక హీరో లేరన్నారు. పవన్ కళ్యాణ్ మెగా హీరో అంటూ విజయేంద్రప్రసాద్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఇక కాలం కలిసి వస్తే తాను పవన్ కళ్యాణ్ కు కథ రాసే అవకాశం ఉండవచ్చు అన్నారు  విజయేంద్రప్రసాద్. మొత్తం మీద రాజమౌళితో పవన్ సినిమా ఉండొచ్చు లేకపోవచ్చు అంటూ.. అటు ఇటు కాకుండా తన వ్యాఖ్యలతో అభిమానుల్ని మరోసారి సందిగ్ధంలో పడేశారు విజయేంద్ర ప్రసాద్.

  అయితే రాజమౌళి గతంలో పవన్‌తో సినిమా చేసేందుకు ప్రయత్నించారు. రవితేజ నటించి హిట్ సాధించిన విక్రమార్కుడు సినిమా కథను రాసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు రాజమౌళి. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ మరో కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటం వలన ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. దీంతో ఆ సినిమా రవితేజతో తీశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాన్‌ రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తోందో? అంటూ సినీ ప్రేక్షకులతో పాటు.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

  First published:

  ఉత్తమ కథలు