Home /News /movies /

RAJAMOULI FATHER V VIJAYENDRA PRASAD NOMINATED FOR RAJYA SABHA SB

రాజ్యసభకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌.. మరో ముగ్గురు ప్రముఖులు.. అంతా దక్షిణాది వారే..

రాజమౌళి తండ్రికి రాజ్యసభ సీటు

రాజమౌళి తండ్రికి రాజ్యసభ సీటు

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు ప్రముఖులు కూడా వెళ్లనున్నారు. అయితే వీరంతా దక్షిణాదివారే కావడం విశేషం.

    ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేసి మరి తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశ అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓక ముద్ర వేశాయని ప్రశింసించారు. రాజ్యసభకు నామినేట్ అయినందుకు అభినందనలు తెలిపారు ప్రధాని .‘శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రదర్శిస్తాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఒక ముద్ర వేసాయి. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు అభినందనలు’ అంటూ మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



    రాజ్యసభకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు ప్రముఖులు కూడా వెళ్లనున్నారు. అయితే వీరంతా దక్షిణాదివారే కావడం విశేషం. రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం నలుగురు సభ్యులను ఎంపిక చేసింది. కేరళకు చెందిన ప్రముక అథ్లేట్ పీటీ ఉష, తమిళనాడుకు చెందిన ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా.. ఏపీకి చెందిన ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్..(ఆంధ్రప్రదేశ్) కర్నాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే...ను మోదీ సర్కార్ రాజ్యసభకు నామినేట్ చేసింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Pm modi, PM Narendra Modi, Rajamouli, Rajya Sabha, SS Rajamouli, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు