• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAJAMOULI DISCIPLE SAI KRISHNA NEW HORROR MOVIE STARTED TODAY TA

Rajamouli: రాజమౌళి శిష్యుడు దర్శకత్వంలో కామెడీ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

Rajamouli: రాజమౌళి శిష్యుడు దర్శకత్వంలో కామెడీ హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..

రాజమౌళి శిష్యుడు కొత్త చిత్రం ప్రారంభం (Twitter/Photo)

Rajamouli | దేశం గర్వించదగిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో ‘కథ మొదలైంది’ పేరుతో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

  • Share this:
    దేశం గర్వించదగిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో ‘కథ మొదలైంది’ పేరుతో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గతంలో రాజమౌళి శిష్యులు చాలా మంది దర్శకులుగా సత్తా చాటారు. ఇపుడు సాయి కృష్ణ .. తొలి చిత్రంతోనే సప్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడుగా తొలి అడుగులు వేయబోతున్నాడు. ఈ చిత్రంలో సంజయ్ వర్మ, లహరి, సంజనా చౌదరి, దర్శిని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్ ఈ చిత్రంలో  కీలక పాత్ర పోషిస్తున్నారు. డ్రీమ్జ్ యానిమేషన్స్ (ప్రై) లిమిటెడ్ బ్యానర్‌పై తమటం కుమార్ రెడ్డి, సన్నిధి ప్రసాద్, టీ రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు షాట్‌కు చిత్ర నిర్మాతల్లో ఒకరైన తమటం కుమార్‌రెడ్డి క్లాప్ ఇచ్చారు.

    రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ ఈ సినిమ కథను విభిన్నమైన కాన్సెప్ట్‌తో  సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనల నుంచి స్పూర్తి పొంది ఈ  సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

    రాజమౌళి శిష్యుడు కొత్త చిత్రం ప్రారంభం (Twitter/Photo)


    ‘ఒక చిన్న విరామం’, ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ‘ చిత్రాల్లో హీరోగా నటించిన సంజయ్ వర్మ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సింగిల్ షెడ్యూల్‌లో హైదరాబాద్‌లోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. మరి రాజమౌళి లాగానే సాయి కృష్ణ కూడా దర్శకుడిగా జక్కన్న పేరు నిలబెట్టెలా ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు