రాజమౌళి RRRలో కీలకపాత్ర పోషించనున్న..ఎన్టీఆర్ హీరోయిన్

పాపులర్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా  తెరకెక్కుతున్న చిత్రం RRR అని తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రకు నిత్య మీనన్‌ను ఎంచుకున్నారని తెలుస్తోంది. నిత్యా.. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కీలకపాత్రలో నటించారు.

news18-telugu
Updated: April 11, 2019, 4:16 PM IST
రాజమౌళి RRRలో కీలకపాత్ర పోషించనున్న..ఎన్టీఆర్ హీరోయిన్
RRR పోస్టర్
news18-telugu
Updated: April 11, 2019, 4:16 PM IST
#RRR.. పాపులర్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా  తెరకెక్కిస్తున్న చిత్రం RRR తెలిసిందే. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇటీవల RRRకు సంబందించిన కార్యక్రమంలో రాజమౌళి.. మాట్లాడుతూ..ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ నటి అలియా భట్, బ్రిటీష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను ఎంపిక చేసినట్లు తెలిపిన విషయం తెలిసిందే.  బ్రిటీష్ భామ డైసీ.. తన వ్యక్తిగత కారణాల రీత్యా  ఈ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిది. దీంతో రాజమౌళి..మళ్లీ కొత్త హీరోయిన్ కోసం వెతకడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పలువురు పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అందులో ముఖ్యంగా ప్రభాస్ సరసన సాహో..లో నటిస్తున్న శ్రద్ధా కపూర్‌ పాటు.. ఈ మధ్యే హిందీ సినిమాలోకి ఆరంగేట్రం చేసిన.. శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్‌ల పేర్లు వినిపించాయి. అయితే తాజగా వస్తున్న వార్తలు ప్రకారం..ఇపుడు మరో పేరు వినబడుతోంది. ఆమె.. సహజ నటి నిత్యామీనన్. ఈమె ఇప్పటికే పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించి..మంచి భావాలు పలికించగల నటిగా పేరు తెచ్చుకుంది.

Photo: Twitter/@MenenNithya


నిత్య మీనన్..ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్..లో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను డైసీ..చేయాల్సీన పాత్ర కోసం ఎంచుకుంటున్నారా..లేదా..మరేదైనా..కీలక పాత్ర కోసమా అనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...