news18-telugu
Updated: April 18, 2020, 12:44 PM IST
ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో పని చేస్తాడనేది ఇప్పుడు కన్ఫ్యూజన్. మరోవైపు ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతోనే తన సినిమా ఉంటుందని రాజమౌళి చెప్పాడు.
అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరో ముఖ్య పాత్రలో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని నటిస్తున్నాడు. అది అలా ఉంటే ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న రాజమౌళి, తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేశాడని సమాచారం. కేఎల్ నారాయణ నిర్మాతగా మహేష్‌తో ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించిన సంగతి తెలిసిందే. రాజమౌళి తరువాతి సినిమా ఇదేనని తాజాగా ఆయన స్పష్టం చేశాడు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ 2020జులై 30 నుండి 2021 జనవరి 8కి వాయిదావేసింది చిత్రబృందం.
Published by:
Suresh Rachamalla
First published:
April 18, 2020, 12:39 PM IST