• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAJAMOULI COMMENTS ON RRR STAR AJAY DEVGAN SR

అలాంటి స్టార్ హీరో మా సినిమాకు దొరకడం మా అదృష్టం : రాజమౌళి

అలాంటి స్టార్ హీరో మా సినిమాకు దొరకడం మా అదృష్టం : రాజమౌళి

దర్శకుడు రాజమౌళి (Rajamouli)

Rajamouli : అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    Rajamouli : అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన ఈమధ్యే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబందించిన ఓ పిక్‌ను చిత్రబృందం ఇటీవలే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్‌లో పాల్గొన్న అజయ్ దేవ్ గణ్ పై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. పని పట్ల ఆయనకున్న డెడికేషన్, కమిట్మెంట్‌ను మెచ్చుకున్నాడు. రాజమౌళిఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అజయ్ దేవగన్.. ఒకసారి కార్వాన్ నుండి బయటికి వస్తే షాట్ ఓకే అయ్యేవరకు లోపలికి వెళ్ళరు పేర్కోన్నాడు. అయితే ఓ రోజు షాట్ పూర్తి కావడానికి చాలా ఆలస్యం అయ్యింది. అయినప్పటికీ ఆ షాట్ పూర్తయ్యేవరకు సెట్స్ లో ఉండి వెళ్లారు. అలాంటి స్టార్ మాకు, మా సినిమాకు దొరకడం అదృష్టం అని అన్నారు రాజమౌళి. రాజమౌళి తెరకెక్కించిన ఈగ మూవీ హిందీలో మక్కీ పేరుతో విడుదల కాగా ఈ చిత్రానికి అజయ్ దేవ్ గణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు