రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌కు రాజమౌళి సవాల్..

Rajamouli: రాజమౌళికి వంటింటికి అస్సలు పడదు.. ఈ రెండింటికి ఆయన చాలా దూరం.. కానీ శుభ్రత పరిశుభ్రత మాత్రం చేస్తున్నాడు. ఇంటి పనులు చేస్తూ ఇప్పుడు అందర్నీ ఇదే చేయాలని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 20, 2020, 3:33 PM IST
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌కు రాజమౌళి సవాల్..
ఎన్టీఆర్, రాజమౌళి, చరణ్ Photo : Twitter
  • Share this:
లాక్ డౌన్ కారణంగా అంతా ఇంటికే పరిమితమైపోయారు. అందులోనూ సెలబ్రిటీస్ అయితే పూర్తిగా ఇంటి పనులతో బిజీ అయిపోయారు. ఇన్ని రోజులు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం ఇంట్లోనే ఉండి భార్యలకు కూడా సాయం చేస్తున్నారు. ఇంటి పనులతో పాటు వంట పనులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి మొదటిది చేసాడు. ఈయనకు వంటలతో చాలా దూరం.. కానీ శుభ్రత పరిశుభ్రత మాత్రం చేస్తున్నాడు. ఇంటి పనులు చేస్తూ ఇప్పుడు అందర్నీ ఇదే చేయాలని కోరుతున్నాడు దర్శక ధీరుడు. తాజాగా తాను చేసిన ఇంటి పనులు మీరు కూడా చేయాలంటూ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు సవాల్ విసిరాడు.

చేతిలో చీపురు పట్టుకుని రాజమౌళి ఇచ్చిన పోజు.. ఆయన చేసిన ట్వీట్ బాగానే వైరల్ అవుతున్నాయి. అదే ఫోటోలో ముందు రమా రాజమౌళి కూడా ఉంది. ఇక ఈ పనులే మీరు కూడా చేయాలని హీరోలతో పాటు దర్శకుడు సుకుమార్, నిర్మాత శోభు యార్లగడ్డ, తన పెద్దన్న కీరవాణికి కూడా సవాల్ చేసాడు రాజమౌళి. ఇదే సవాల్ రాజమౌళికి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసాడు. మొత్తానికి లాక్ డౌన్ పుణ్యమా అని అన్ని పనుల్లోనూ ప్రావీణ్యులు అవుతున్నారు మన సెలబ్రిటీస్.
Published by: Praveen Kumar Vadla
First published: April 20, 2020, 3:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading