Rajamouli - Boney Kapoor: | ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి తీరుపై ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యాడు. అంతేకాదు తనను జక్కన్న దారుణంగా మోసం చేసినట్టు పేర్కొన్నాడు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘రౌద్రం రణం రుధిరం’ అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ (RRR release date confirmed Photo : Twitter)
దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ,తమిళం, కన్నడ, మలయాళంలో పాటు దాదాపు 8 భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన దాదాపు 90 శాతం షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీటైంది. ఒక్క నెల రోజుల షూటింగ్‌తో ఈ సినిమాకు రాజమౌళి గుమ్మడికాయ కొట్టేయనున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter
ఈ సినిమాను దేశ వ్యాప్తంగా దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ డేట్‌ను అధికారికంగా ప్రకటించడంపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యాడు.

రాజమౌళి, బోనీ కపూర్ (File/Photo)
ఈయన నిర్మాతగా అజయ్ దేవ్‌గణ్ హీరోగా ‘మైదాన్’ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్టు ఆరు నెలల ముందే ప్రకటించానని చెప్పుకొచ్చాడు. నేను ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించిన డేట్‌కు రెండు రోజులు ముందు ఆర్ఆర్ఆర్ను రాజమౌళి విడుదల చేయాలనుకోవడం అన్యాయం అని చెప్పుకొచ్చాడు.

దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానున్న అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’ మూవీ (Twitter/Photo)
ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ మొత్తం కలిసికట్టుగా ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ విడుదల తేది పై స్పందించారు. నేను ఎపుడో ఆరు నెలల కిందటే ‘మైదాన్’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాను. కానీ రాజమౌళి మాత్రం ఎవరినీ సంప్రదించకుండా.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల తేదిని ప్రకటించడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాజమౌళి, బోనీ కపూర్ (File/Photo)
అందరం ఒక్కటిగా ఉండి సినీ ఇండస్ట్రీని కాపాడాల్సిన ఈ సమయంలో రాజమౌళి ఎవరిని సంప్రదించకుండా ఇలాంటి ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం తనతో పాటు చాలా మందికి నచ్చలేదన్నారు. ఈ విషయమై నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈయన తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’కు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

మైదాన్ వర్సెస్ ఆర్ఆర్ఆర్ (Twitter/Photo)
బోనీ కపూర్ నిర్మాతగా ‘మైదాన్’ చిత్ర విషయానికొస్తే.. ఈ సినిమాను ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ .. సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో ఒకేసారి హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఒక చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ రెండు చిత్రాల్లో అజయ్ దేవ్‌గణ్ నటించడం విశేషం.