మెగాస్టార్ చిరంజీవికి దర్శక ధీరుడు రాజమౌళి పెద్ద షాక్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ అప్సెట్లో ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను దేవాదాయ ధర్మదాయ శాఖలో జరిగే అన్యాయాలపై ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. ఒకటి ఆచార్య పాత్ర అయితే... రెండోది నక్సలైట్ పాత్ర అని చెబుతున్నారు.ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర ఉంది. హీరోతో సమానమైన ఈ పాత్ర కోసం రామ్ చరణ్‌ను అనుకున్నారు. అందుకోసం రాజమౌళి పర్మిషన్ కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. త్వరలోనే ఒకే సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కనిపిస్తే చూడాలకున్నారు అభిమానులు.

చిరంజీవి రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
ఇక చరణ్ ఈ సినిమా చేయాలంటే రాజమౌళి ఒప్పుకోవాలని కొన్ని రోజుల ముందు చిరంజీవి ఓ మాట చెప్పిన సంగతి తెలిసిందే కదా. రాజమౌళి కూడా ఈ సినిమాలో చరణ్ యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో చిరంజీవి ఆచార్యలో రామ్ చరణ్ నటించడం ఖాయం అయిపోయిందకున్నారు అందరు.కానీ కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రత్యేకమైన గెటప్‌లో కనిపించనున్నాడు.ఈ సినిమా అయిపోయే వరకు ఆ గెటప్ నుంచి బయటకు రాకూడదు. అంతేకాదు అదే గెటప్‌తో వేరే సినిమాలో నటించకూడదు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిపోయి ఉంటే..రామ్ చరణ్ నటించడానికి రాజమౌళి ఒప్పుకునేవాడు. కానీ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పాత్ర కూడా కొత్త కనిపించాలి. దాని కోసం చరణ్ మేకోవర్ కావాలి. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేకమైన ఆహార్యంతో ఉన్న రామ్ చరణ్ .. ఇపుడు ఆచార్య కోసం తన లుక్‌ను మార్చుకోవడం అంత ఈజీ కాదు.

రామ్ చరణ్ చిరు రాజమౌళి (Ram Charan chiranjeevi rajamouli)
ఒకవేళ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆచార్య సినిమాలో నటిస్తే తనకెలాంటి ఇబ్బంది లేదంటున్నాడు రాజమౌళి. అప్పటి వరకు ఆగాలంటే బడ్జెట్ తడిసి మోపెడతుంది. ఇప్పటికే కరోనా కారణంగా అన్ని సినిమాలకు భారీగా నష్టపోయారు. ఇపుడు రామ్ చరణ్ కోసం మరిన్ని ఆగే పరిస్థితి చిరంజీవికి లేదు.
అందుకే మెగా క్యాంప్ ఇపుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. మరి అన్నయ్య కోసం పవన్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తాడా అనేది చూడాలి.Published by:Kiran Kumar Thanjavur
First published:May 13, 2020, 07:43 IST