Bahubali: హీరోగా మారిన మరో బుల్లి బాహుబలి.. ఎంత అందంగా ఉన్నాడో చూశారా..?

Bahubali

Bahubali: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వారసత్వాలు హీరోలుగా పరిచయమయ్యారు. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక ఈ మధ్య బాల నటులు కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నారు.

  • Share this:
    Bahubali: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వారసత్వాలు హీరోలుగా పరిచయమయ్యారు. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక ఈ మధ్య బాల నటులు కూడా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమవుతున్నారు. కొందరు స్టార్ హీరోలు కూడా బాలనటులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బాలనటుడు టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా ఎంత సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించిన నటులు అందరూ తమ పాత్రలతో బాగా మెప్పించారు. ఇందులో బాహుబలి పాత్రలో బాలనటిగా నటించిన సాత్విక్ వర్మ. తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నాడు.అంతేకాకుండా రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య వంటి పలు సినిమాల్లో బాల నటుడిగా బాగా మెప్పించాడు. ఇక హీరోగా సిద్ధమయ్యాడు. డైరెక్టర్ శివ దర్శకత్వంలో 'బ్యాచ్' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇందులో నేహా పటాన్ హీరోయిన్ గా నటించింది. బేబీ ఆరాధ్య సమర్పణలో రమేష్ ఘన మజ్జి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సత్తిబాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది సహా నిర్మాతలుగా చేశారు.

    క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కాలేజీ కుర్రాళ్ళ కథతో రూపొందింది. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడు కుంచె సంగీతాన్ని అందించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సాత్విక్ వర్మ ఎటువంటి సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి. ఇక ఇప్పటికే హీరో శ్రీకాంత్ కొడుకు, మరో బాలనటుడు తేజ కూడా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక వారి సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
    Published by:Navya Reddy
    First published: