రాజమౌళి సంచలన నిర్ణయం.. ‘RRR’ బడ్జెట్‌లో కోత తప్పదా..?

Rajamouli: తెలుగు సినిమా మార్కెట్‌తో పాటు బడ్జెట్ కూడా పెంచిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఒకేసారి 300 కోట్లు పెట్టి బాహుబలి సినిమా చేసాడు ఈయన. దానికి మూడింతల వసూళ్లు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 5, 2020, 9:08 PM IST
రాజమౌళి సంచలన నిర్ణయం.. ‘RRR’ బడ్జెట్‌లో కోత తప్పదా..?
దర్శకుడు రాజమౌళి (rajamouli)
  • Share this:
తెలుగు సినిమా మార్కెట్‌తో పాటు బడ్జెట్ కూడా పెంచిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఒకేసారి 300 కోట్లు పెట్టి బాహుబలి సినిమా చేసాడు ఈయన. దానికి మూడింతల వసూళ్లు కూడా తీసుకొచ్చింది ఈ చిత్రం. దాంతో కథలో దమ్ముండాలే కానీ ఎన్ని కోట్లైనా పెట్టొచ్చని రాజమౌళి నిరూపించాడు. ఇప్పుడు ఈయన చేస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు నిర్మాత దానయ్య. ఈయన ఇచ్చిన ధైర్యంతోనే సాహో, సైరా లాంటి భారీ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు కరోనా ప్రభావంతో తెలుగు సినిమా ఒక్కటే కాదు ప్రపంచ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది.

దర్శకుడు రాజమౌళి (rajamouli)
దర్శకుడు రాజమౌళి (rajamouli)


ముందున్న పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. బడ్జెట్ విషయంలో కానీ.. రెమ్యునరేషన్ విషయంలో కానీ ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కరోనాతో నిర్మాతలకే కాదు ఇండస్ట్రీకి కూడా కోట్ల నష్టం వచ్చింది. ముఖ్యంగా ఇండియన్ సినిమా అయితే ఇప్పటికే ఈ రెండు నెలల్లో దాదాపు 5 వేల నష్టపోయిందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇలాంటి ఈ సమయంలో బడ్జెట్ కంట్రోలింగ్ గురించి రాజమౌళి చర్చించాడు. ఈ మధ్యే ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బడ్జెట్ విషయంలో పొదుపు పాటించాల్సిందే.. తప్పదని స్పష్టం చేశాడు.

దర్శకుడు రాజమౌళి (Rajamouli)
దర్శకుడు రాజమౌళి (Rajamouli)


ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజమౌళి తెలిపాడు. అది ప్రొడక్షన్ విషయంలో కాకుండా రెమ్యునరేషన్స్ పరంగా తీసుకుంటే సినిమా ఔట్ పుట్‌పై ప్రభావం పడకుండా ఉంటుంది. ఏ సినిమా అయినా కూడా ఇప్పుడు బడ్జెట్ కంట్రోల్ సూత్రాలు అయితే పాటించాల్సిందే.. కొన్ని రోజులు ఇది తప్పదంటున్నాడు దర్శక ధీరుడు. మరి ట్రిపుల్ ఆర్‌కు కూడా ఇదే తప్పదేమో మరి..? తన సినిమాకు కూడా రెమ్యునరేషన్స్‌లో కాస్త కోత పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడ కట్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ మాత్రం అలాగే ఉంచబోతున్నాడు జక్కన్న.
First published: June 5, 2020, 9:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading