Home /News /movies /

RAJAMOULI AJAY DEVGN JR NTR RAM CHARANS RRR MOVIE ANOTHER RECORD THIS MOVIE SCREENING AT WORLD BIGGEST SCREEN ODION THEATRE AT UK ENGLAND HERE ARE THE DETAILS TA

RRR : యూకేలో ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ పై ప్రదర్శన..

ఆర్ఆర్ఆర్ (File/Photo)

ఆర్ఆర్ఆర్ (File/Photo)

RRR | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌ (Ram Charan), అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా యూకేలోని అతిపెద్ద స్క్రీన్స్‌లో ప్రదర్శించారు.

ఇంకా చదవండి ...
    RRR | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌ (Ram Charan), అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కరోనా కారణంగా  వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆ మధ్య ప్రకటించింది. దీంతో జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ టీమ్  ఈ సినిమా కోసం మార్చి 18, ఏప్రిల్ 28 రెండు తేదీలను లాక్ చేసింది. ఆ తర్వాత మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకు మరో మూడు వారాలు మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రపంచంలోని అతి పెద్ద స్క్రీన్ పై ప్రదర్శించనున్నారట.

    ఆర్ఆర్ఆర్ (Twitter/Photo)


    యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియోటర్స్ అయితే ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది. ఇకే యూకేలోని వెయ్యి స్క్రీన్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేస్తున్నారట. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటించారు.  అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.  మరోవైపు ఈ చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.

    Bheemla Nayak 6 Days WW Collections : ‘భీమ్లా నాయక్’ 6 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ’వకీల్ సాబ్’ వసూళ్లను క్రాస్ చేసిన మూవీ..

    ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.

    NBK - Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’ సహా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన స్టోరీలతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు తెలుసా..


    సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు. ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ajay Devgn, Alia Bhatt, Bollywood, Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు