news18-telugu
Updated: November 11, 2020, 2:37 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన రాజమౌళి (Twitter/Photo)
Rajamouli Green India Challenge| గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పలువురు మొక్కలు నాటుతూ.. పర్యావరాణాన్ని కాపాడుతున్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిరంతర ప్రవాహినిలా సాగుతుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరు ఈ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ప్రస్తుతం దేశమంతా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఒక ట్రెండ్‌లా నడుస్తోంది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దర్శక బాహుబలి రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి లింగంపల్లిలోని ఆర్ఆర్ఆర్ షూటింగ్ లొకేషన్లో 25 టీమ్ మెంబర్స్‌తో కలిసి మొక్కలు నాటి సెల్పీలు దిగారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రౌద్రం రణం రుధిరం సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ అనే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ గారిని రాజమౌళి అభినందించారు. అంతేకాదు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని అందరు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. రాబోయే తరాలకు మంచి పర్యావరణం ఇవ్వాలంటే అది మొక్కలతోనే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వినాయక్, పూరీ జగన్నాథ్‌లను మొక్కలు నాటాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నామినేట్ చేసారు. అంతేకాదు రాధేశ్యామ్,ఆచార్య, పుష్పటీమ్ మెంబర్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని జక్కన్న పిలుపునిచ్చాడు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 11, 2020, 2:37 PM IST