హోమ్ /వార్తలు /సినిమా /

Raja Vikramarka Movie Review : కార్తికేయ ‘రాజా విక్రమార్క’ మూవీ రివ్యూ..

Raja Vikramarka Movie Review : కార్తికేయ ‘రాజా విక్రమార్క’ మూవీ రివ్యూ..

కార్తికేయ ‘రాజా విక్రమార్క’  కలెక్షన్స్ (Twitter/Photo)

కార్తికేయ ‘రాజా విక్రమార్క’ కలెక్షన్స్ (Twitter/Photo)

Raja Vikramarka Movie Review : RX100 లాంటి బ్లాక్ బస్టర్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో కార్తికేయ. అయితే ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా సరైన విజయం అందుకోలేదు. ఇలాంటి సమయంలో NIA ఏజెంట్ గా ఈయన నటించిన సినిమా రాజా విక్రమార్క. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

ఇంకా చదవండి ...

రివ్యూ: రాజా విక్రమార్క

నటీనటులు: కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, తనికెళ్ల భరణి తదితరులు..

సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి

నిర్మాత: 88 రామా రెడ్డి

దర్శకుడు: శ్రీ సిరిపల్లి

RX100 లాంటి బ్లాక్ బస్టర్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో కార్తికేయ. అయితే ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా సరైన విజయం అందుకోలేదు. ఇలాంటి సమయంలో NIA ఏజెంట్ గా ఈయన నటించిన సినిమా రాజా విక్రమార్క. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

కథ:

విక్రమ్ (కార్తికేయ) ఓ NIA ఏజెంట్. రాష్ట్ర హోం మినిస్టర్ (సాయి కుమార్) కు నక్సలైట్స్ నుంచి బెదిరింపు ఉండడంతో ఆయనను కాపాడడానికి స్పెషల్ మిషన్ మీద వస్తాడు విక్రమ్. ఈ క్రమంలోనే హోం మినిస్టర్ కూతురు కాంతి (తాన్య రవిచంద్రన్) తో ప్రేమలో పడతాడు. ఆ సమయంలోనే ఉన్నట్టుండి కాంతిని నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు. అప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడు.. అతని కాపాడడానికి వచ్చిన విక్రమ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు.. వీళ్లకు పోలీస్ ఆఫీసర్ గోవింద్ (సుధాకర్ కోమకుల) నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది మిగతా కథ..

కథనం:

హీరో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సీక్రెట్ ఏజెంట్ గా ఉండటం.. ఒక రాజకీయ నాయకుడికి ప్రాణాపాయం ఉంటే అతడికి సెక్యూరిటీగా ఉండి అతడిని రక్షించడం.. ఇలాంటి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కార్తికేయ రాజా విక్రమార్క కూడా ఆ తరహా కథతోనే వచ్చింది. కొత్త దర్శకుడు శ్రీ సిరిపల్లి తెలిసిన కథనే ఆసక్తికరంగా చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఫస్టాఫ్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా సాగే కథనం సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. ఫస్టాఫ్ మొత్తం కామెడీ విత్ యాక్షన్ మిక్స్ చేసి బాగానే తెరకెక్కించాడు. కానీ ఇంటర్వెల్లో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన తర్వాత కథలో వేగం నెమ్మదించింది. అప్పటివరకు వేగంగా సాగిన స్క్రీన్ ప్లే కాస్త మందకొడిగా ముందుకు వెళ్ళింది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు సన్నివేశాలు ఇంకాస్త వేగంగా ఉండుంటే సినిమా రేంజ్ పెరిగేది. తనకు ఉన్నంతలో కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్ళడానికి దర్శకుడు విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ కీలకమైన రెండో అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలు బాగా నెమ్మదించడంతో సినిమా స్పీడ్ కు బ్రేకులు పడతాయి. క్లైమాక్స్ కు ముందే విలన్ ఎవరో తెలుసిపోవడంతో ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు సినిమాలో చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా సెకండాఫ్ కూడా ఉండుంటే కార్తికేయ చాలా పెద్ద హిట్ కొట్టేవాడు. ఓవరాల్ గా రాజా విక్రమార్క యావరేజ్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది.

నటీనటులు:

ఈ సినిమాకు ప్రధాన బలం కార్తికేయ. సీక్రెట్ ఏజెంట్ గా అద్భుతమైన నటన కనబర్చాడు కార్తికేయ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినిమాను నిలబెట్టాడు. హీరోయిన్ తాన్య రవిచంద్రన్ తనకు ఉన్నంతలో బాగా నటించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల క్యారెక్టర్ కూడా బాగుంది. కార్తికేయ టీం హెడ్ పాత్రలో తనికెళ్ళ భరణి క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. మిగిలిన వాళ్లు అందరూ తమ పాత్రలకి తగ్గట్టు నటించారు.

టెక్నికల్ టీం:

ప్రశాంత్ ఆర్ విహారి అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ కాస్త వీక్. బోర్ కొట్టించే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ సెకండాఫ్ బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో సింహభాగం మాటల రచయితకి ఇవ్వాలి. అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. దర్శకుడు శ్రీ సిరిపల్లి తెలిసిన కథనే రాసుకున్నా.. స్క్రీన్ ప్లే బాగా అల్లుకున్నాడు. అక్కడ గురు వివి వినాయక్ మార్క్ స్పష్టంగా కనిపించింది.

చివరగా ఒక్కమాట:

రాజా విక్రమార్క.. యావరేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్..

రేటింగ్: 2.75/5

First published:

Tags: Kartikeya, Raja Vikramarka, Tollywood

ఉత్తమ కథలు