Home /News /movies /

Raja Vikramarka Closing WW Collections: కార్తికేయ ‘రాజా విక్రమార్క’ క్లోజింగ్ కలెక్షన్స్.. కొత్త పెళ్లికొడుక్కి డిజాస్టర్..

Raja Vikramarka Closing WW Collections: కార్తికేయ ‘రాజా విక్రమార్క’ క్లోజింగ్ కలెక్షన్స్.. కొత్త పెళ్లికొడుక్కి డిజాస్టర్..

కార్తికేయ ‘రాజా విక్రమార్క’  కలెక్షన్స్ (Twitter/Photo)

కార్తికేయ ‘రాజా విక్రమార్క’ కలెక్షన్స్ (Twitter/Photo)

Raja Vikramarka Closing WW Collections: ‘రాజా విక్రమార్క’ (Raja Vikramarka Closing WW Collections) సినిమాను రూ.4.3 కోట్లకు అమ్మారు. అంటే ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే కనీసం 5 కోట్లు షేర్ తీసుకురావాలి. కార్తికేయ మార్కెట్‌కు ఈ థియేట్రికల్ బిజినెస్ రీజనబుల్‌గానే జరిగింది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా వర్షాలు ఉండటంతో సినిమా దారుణంగా నిరాశ పరిచింది. 

ఇంకా చదవండి ...
ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకుని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ గుమ్మకొండ. ఆ ఒక్క సినిమా మాత్రమే ఇప్పటి వరకు ఈయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన గుణ 369, హిప్పీ, చావు కబురు చల్లగా లాంటి సినిమాలు నిరాశ పరిచాయి. ఇలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ తాజా చిత్రం రాజా విక్రమార్క. పైగా చిరంజీవి టైటిల్‌తో రావడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. కొత్త దర్శకుడు శ్రీ సిరిపల్లి తెరకెక్కించిన రాజా విక్రమార్కకు తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చేసిన దర్శకుడు.. సెకండాఫ్ పూర్తిగా వదిలేసాడంటూ విమర్శలు వస్తున్నాయి. సినిమా వసూళ్లపై కూడా ఈ టాక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పాటు వర్షాలు కూడా ఈ సినిమాపై దారుణమైన ప్రభావం చూపించాయి.

కార్తికేయ గత సినిమా చావు కబురు చల్లగాకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా ఇప్పుడు రాజా విక్రమార్కకు రాలేదు. మంచి ప్రమోషన్స్ చేసినా కూడా సినిమా టాక్ తేడాగా ఉండటంతో రాజా విక్రమార్క బాక్సాఫీస్ దగ్గర కాస్త వెనకబడిపోయాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. మరి రాజా విక్రమార్క క్లోజింగ్ వసూళ్ళు ఓ సారి ఏరియా వైజ్ ఎంత వచ్చాయో చూద్దాం..

Pushpaka Vimanam Closing collections: ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ క్లోజింగ్ కలెక్షన్స్..



నైజాం: 0.57 కోట్లు
సీడెడ్: 0.31 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.36 కోట్లు
ఈస్ట్: 0.23 కోట్లు
వెస్ట్: 0.16 కోట్లు
గుంటూరు: 0.16 కోట్లు
కృష్ణా: 0.21 కోట్లు
నెల్లూరు: 0.18 కోట్లు

ఏపీ + తెలంగాణ: 2.11 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.22 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 2.33 కోట్లు షేర్

Mahesh Babu: నా జోలికి రాకండి.. నేను చేయను.. ఆ విషయంలో మహేష్ బాబు మొండిపట్టుకు కారణం ఇదే..!


‘రాజా విక్రమార్క’ సినిమాను రూ.4.3 కోట్లకు అమ్మారు. అంటే ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే కనీసం 5 కోట్లు షేర్ తీసుకురావాలి. ఈ సినిమాకు క్లోజింగ్ కలెక్షన్స్ 2.33 కోట్లు షేర్ మాత్రమే షేర్ వచ్చింది. అంటే 2.17 కోట్ల దూరంలోనే ఈ చిత్రం ఆగిపోయింది. కార్తికేయ మార్కెట్‌కు ఈ థియేట్రికల్ బిజినెస్ రీజనబుల్‌గానే జరిగింది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా వర్షాలు ఉండటంతో సినిమా దారుణంగా నిరాశ పరిచింది. లేదంటే కచ్చితంగా వీకెండ్ ఉపయోగపడే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి కొత్త పెళ్లికొడుక్కి మరో డిజాస్టర్ వచ్చేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Box Office Collections, RX 100 Fame Karthikeya, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు