Raja Vikramarka 1st Week Collections: ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సషనల్ హిట్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు హీరో కార్తికేయ గుమ్మకొండ. ఆ ఒక్క సినిమా మాత్రమే ఇప్పటి వరకు ఈయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన గుణ 369, హిప్పీ, చావు కబురు చల్లగా లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. ఇలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ తాజా చిత్రం రాజా విక్రమార్క. పైగా చిరంజీవి టైటిల్‌తో రావడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. కొత్త దర్శకుడు శ్రీ సిరిపల్లి తెరకెక్కించిన రాజా విక్రమార్కకు తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చేసిన దర్శకుడు.. సెకండాఫ్ పూర్తిగా వదిలేసాడంటూ విమర్శలు వచ్చాయి. సినిమా వసూళ్లపై కూడా ఈ టాక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
కార్తికేయ గత సినిమా చావు కబురు చల్లగాకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా ఇప్పుడు రాజా విక్రమార్కకు రాలేదు. మంచి ప్రమోషన్స్ చేసినా కూడా సినిమా టాక్ తేడాగా ఉండటంతో రాజా విక్రమార్క బాక్సాఫీస్ దగ్గర కాస్త వెనకబడిపోయాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. మరి రాజా విక్రమార్క తొలిరోజు వసూళ్ళు రూ. కోటి కూడా దాటలేదు.
Balakrishna - Kodandarami Reddy : బాలకృష్ణ, కోదండరామిరెడ్డి సహా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్..
నైజాం: 0.51 కోట్లు
సీడెడ్: 0.28 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.34 కోట్లు
ఈస్ట్: 0.19 కోట్లు
వెస్ట్: 0.15 కోట్లు
గుంటూరు: 0.18 కోట్లు
కృష్ణా: 0 .21 కోట్లు
నెల్లూరు: 0.16 కోట్లు
ఏపీ + తెలంగాణ: 2.02 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.22 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 2.24 కోట్లు షేర్
‘రాజా విక్రమార్క’ సినిమాను రూ.4.3 కోట్లకు అమ్మారు. అంటే ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే కనీసం 5 కోట్లు షేర్ తీసుకురావాలి. తొలిరోజు ఈ సినిమాకు రూ. 71 లక్షలు మాత్రమే షేర్ వచ్చింది. వీకెండ్ వరకు రూ. 2.24 షేర్ మాత్రమే రాబట్టి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ దిశగా దూసుకుపోతుంది. మొత్తంగా కార్తికేయ కెరీర్‌లో ‘రాజా విక్రమార్క’ మరో ఫ్లాప్‌గా మిగిలిపోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kartikeya, Raja Vikramarka, Tollywood