Home /News /movies /

Raja Vikramarka 1st Day WW Collections: ‘రాజా విక్రమార్క’ ఫస్ట్ డే కలెక్షన్స్.. డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చిన కార్తికేయ..

Raja Vikramarka 1st Day WW Collections: ‘రాజా విక్రమార్క’ ఫస్ట్ డే కలెక్షన్స్.. డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చిన కార్తికేయ..

కార్తికేయ ‘రాజా విక్రమార్క’ మూవీ రివ్యూ (Twitter/Photo)

కార్తికేయ ‘రాజా విక్రమార్క’ మూవీ రివ్యూ (Twitter/Photo)

Raja Vikramarka 1st Day WW Collections: ఆర్ఎక్స్ 100 (RX100) సినిమాతో సంచలన విజయం అందుకుని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఆ తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు ఈ హీరో. తాజాగా ఈయన నటించిన రాజా విక్రమార్క (Raja Vikramarka 1st Day WW Collections) విడుదలైంది. మరి దీని వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఇంకా చదవండి ...
ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం అందుకుని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ గుమ్మకొండ. ఆ ఒక్క సినిమా మాత్రమే ఇప్పటి వరకు ఈయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన గుణ 369, హిప్పీ, చావు కబురు చల్లగా లాంటి సినిమాలు నిరాశ పరిచాయి. ఇలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ తాజా చిత్రం రాజా విక్రమార్క. పైగా చిరంజీవి టైటిల్‌తో రావడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచేసింది. కొత్త దర్శకుడు శ్రీ సిరిపల్లి తెరకెక్కించిన రాజా విక్రమార్కకు తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చేసిన దర్శకుడు.. సెకండాఫ్ పూర్తిగా వదిలేసాడంటూ విమర్శలు వస్తున్నాయి. సినిమా వసూళ్లపై కూడా ఈ టాక్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

కార్తికేయ గత సినిమా చావు కబురు చల్లగాకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా ఇప్పుడు రాజా విక్రమార్కకు రాలేదు. మంచి ప్రమోషన్స్ చేసినా కూడా సినిమా టాక్ తేడాగా ఉండటంతో రాజా విక్రమార్క బాక్సాఫీస్ దగ్గర కాస్త వెనకబడిపోయాడు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. మరి రాజా విక్రమార్క తొలిరోజు వసూళ్ళు ఓ సారి ఏరియా వైజ్ ఎంత వచ్చాయో చూద్దాం..

Pushpaka Vimanam 1st day collections: ఆనంద్ దేవరకొండ ‘పుష్పక విమానం’ ఫస్ట్ డే కలెక్షన్స్..



నైజాం: 0.19 కోట్లు
సీడెడ్: 0.06 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.09 కోట్లు
ఈస్ట్: 0.06 కోట్లు
వెస్ట్: 0.05 కోట్లు
గుంటూరు: 0.06 కోట్లు
కృష్ణా: 0.07 కోట్లు
నెల్లూరు: 0.04 కోట్లు

ఏపీ + తెలంగాణ: 0.62 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.09 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 0.71 కోట్లు షేర్

Mahesh Babu: నా జోలికి రాకండి.. నేను చేయను.. ఆ విషయంలో మహేష్ బాబు మొండిపట్టుకు కారణం ఇదే..!


‘రాజా విక్రమార్క’ సినిమాను రూ.4.3 కోట్లకు అమ్మారు. అంటే ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే కనీసం 5 కోట్లు షేర్ తీసుకురావాలి. తొలిరోజు ఈ సినిమాకు 71 లక్షలు మాత్రమే షేర్ వచ్చింది. మరో 4.2 కోట్లు షేర్ వస్తే కానీ సినిమా హిట్ అవ్వదన్నమాట. కార్తికేయ మార్కెట్‌కు ఈ థియేట్రికల్ బిజినెస్ రీజనబుల్‌గానే జరిగింది. యావరేజ్ టాక్ ఉంది కాబట్టి ప్రమోషన్స్ ఇంకాస్త గట్టిగా చేసుకుంటే.. వీకెండ్ ఉపయోగపడే అవకాశాలు లేకపోలేదు. కానీ అదంత సులువైన విషయం కాదు. కార్తికేయ ఈ టాక్‌తో హిట్ కొట్టాలంటే మ్యాజిక్ జరగాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Box Office Collections, RX 100 Fame Karthikeya, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు