ఇక్కడే ఉన్నా.. ఎక్కడికి పారిపోలేదు.. యాక్సిడెంట్‌పై రాజ్ తరుణ్ వీడియో..

రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఆయన పేరు ఎప్పుడూ మార్మోగలేదు. ఎప్పుడూ సినిమాలతో మనోడు వార్తల్లో ఉండటమే కానీ ఇతర విషయాలపై పెద్దగా బయటికి వచ్చింది లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 4:44 PM IST
ఇక్కడే ఉన్నా.. ఎక్కడికి పారిపోలేదు.. యాక్సిడెంట్‌పై రాజ్ తరుణ్ వీడియో..
రాజ్ తరుణ్ ఫైల్ ఫోటో (Source: twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 4:44 PM IST
రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఆయన పేరు ఎప్పుడూ మార్మోగలేదు. ఎప్పుడూ సినిమాలతో మనోడు వార్తల్లో ఉండటమే కానీ ఇతర విషయాలపై పెద్దగా బయటికి వచ్చింది లేదు. అయితే ఒకరోజు కింద మనోడి కార్ యాక్సిడెంట్ అయింది. హైదరాబాద్ అలకాపురి జంక్షన్ దగ్గర రాజ్ తరుణ్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అయితే అక్కడితోనే అసలు సినిమా మొదలైంది. కార్ అక్కడే వదిలేసి రాజ్ తరుణ్ పారిపోవడంతో అసలు ఇష్యూ మొదలైంది. అసలు ఎందుకు రాజ్ తరుణ్ పారిపోయాడు అంటూ మీడియాలో చాలా కథనాలే వచ్చాయి.

Raj Tarun released a special video on his accident and given clarity about so many things pk రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఆయన పేరు ఎప్పుడూ మార్మోగలేదు. ఎప్పుడూ సినిమాలతో మనోడు వార్తల్లో ఉండటమే కానీ ఇతర విషయాలపై పెద్దగా బయటికి వచ్చింది లేదు. raj tarun,raj tarun facebook,raj tarun twitter,raj tarun instagram,raj tarun accident,raj tarun accident video,raj tarun video,raj tarun selfie video,raj tarun movies,telugu cinema,రాజ్ తరణ్,రాజ్ తరుణ్ సెల్ఫీ వీడియో,రాజ్ తరుణ్ యాక్సిడెంట్,తెలుగు సినిమా
రాజ్ తరుణ్ ఫైల్ ఫోటో (Source: twitter)


పైగా ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు రాజ్ తరుణ్ కనిపించలేదు. దాంతో ఎక్కడ లేని అనుమానాలన్నీ వచ్చాయి. ఇప్పుడు వీటిపై స్పందిస్తూ రాజ్ తరుణ్ ఓ వీడియో విడుదల చేసాడు. ఇందులో తన యాక్సిడెంట్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని చెప్పుకొచ్చాడు ఈయన. తను మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయని.. అయితే అందులో నిజం లేదని చెప్పాడు ఈయన. ఆ సమయంలో తానెలాంటి డ్రింక్ చేయలేదని చెప్పాడు ఈ హీరో. ఇక యాక్సిడెంట్‌లో తనకెలాంటి గాయాలు కాలేదని.. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాడు రాజ్.

ప్రమాదం జరిగిన సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి బతికిపోయాను కానీ లేదంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నాడు ఈయన. అంతేకాదు కార్ డ్రైవ్ చేసేవాళ్లంతా కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలంటూ చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. బైక్ నడిపే వాళ్లు హెల్మెట్ కూడా పెట్టుకోవాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాడు. ఇక యాక్సిడెంట్ అయిన తర్వాత తానెక్కడికి పారిపోలేదని.. తన ఇంట్లోనే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ఈయన ఇచ్చిన క్లారిటీతో ఈ ఇష్యూ ఇక్కడితో క్లోజ్ అయిపోతుందనే అంతా భావిస్తున్నారు.
First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...