Home /News /movies /

RAJ KUNDRA SLAMS EXWIFE WHO BLAMED SHILPA SHETTY FOR THEIR SPLIT IN VIRAL VIDEO SU

Raj Kundra: ఆమెకు నా సోదరి భర్తతో ఎఫైర్ ఉంది.. విడాకులకు శిల్ప కారణం కాదు.. ఆ వీడియోపై రాజ్‌కుంద్రా ఫైర్

రాజ్‌కుంద్రా, శిల్పశెట్టి(ఫైల్ ఫొటో)

రాజ్‌కుంద్రా, శిల్పశెట్టి(ఫైల్ ఫొటో)

తాను కవితతో విడిపోవడానికి శిల్పా శెట్టి కారణమం కాదని రాజ్‌కుంద్రా స్పష్టం చేశారు. గతంలో కవిత తనపై చేసిన ఆరోపణలను రాజ్‌కుంద్రా ఖండించారు.

    తన మాజీ భార్య కవిత మాట్లాడిన పాత వీడియో ఒకటి వైరల్‌గా మారడంపై ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా స్పందించారు. తాను కవితతో విడిపోవడానికి శిల్పా శెట్టి కారణమం కాదని రాజ్‌కుంద్రా స్పష్టం చేశారు. గతంలో కవిత తనపై చేసిన ఆరోపణలను రాజ్‌కుంద్రా ఖండించారు. అలాగే కవితతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. Pinkvillaకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొదటి వివాహం గురించి పలు విషయాలను ప్రస్తావించారు. కవిత లండన్‌లో నివసిస్తున్నట్టు తన సోదరి భర్తతో ఆమెకు ఎఫైర్ ఉందని రాజ్‌కుంద్రా ఆరోపించారు. ఇక, రాజ్‌కుంద్రా తన మొదటి కవితతో 2006లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2009లో శిల్పా శెట్టిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

    ‘నా భార్య పుట్టిన రోజు తర్వాత కొన్ని రోజులకు.. 11 ఏళ్ల కిందటి తలతోక లేని కథ వైరల్‌గా మారింది. మమ్మల్ని దుర్భాషలాడటానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి వెనక కొంత ఎజెండా ఉంది. నేను 12 ఏళ్లు నిశ్శబ్దంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మౌనం వీడుతున్నాను. కవిత లండన్‌లో ఉన్నప్పుడు ఆమె నా సోదరి భర్తతో ఎఫైర్ ఉంది. నా మాజీ బావతో ఆమె ఎక్కువ సమయం గడిపేది. ముఖ్యంగా నేను బిజినెస్ ట్రిప్స్ కోసం వెళ్లినప్పుడు. వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని.. నా కుటుంబంలోని చాలా మంది చెప్పారు. నా కారు డ్రైవర్ కూడా ఈ విషయం నాతో అన్నాడు. అయితే నేను అది నమ్మలేదు.

    ఇక, నా సోదరి, ఆమె భర్తను ఇండియాకు పంపిచాం. ఎందుకంటే వారు తమ ఇంట్లో నివసించడం అసౌకర్యంగా అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత కూడా కవిత నా సోదరి భర్తతో మాట్లాడుతూ ఉండేది. వారిద్దరు తరుచూ మెసేజ్‌లు చేసుకునేవారు. ఒకరోజు ఇండియాలోని నా సోదరి నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు ఆమె ఏడుస్తూ ఒక విషయం నాతో చెప్పింది. ఆమె భర్త సీక్రెట్‌గా వాడుతున్న ఓ ఫోన్ దొరికిందని.. అందులో యూకే నంబర్‌ నుంచి సందేశాలు ఉన్నాయని తెలిపింది. అందులో చాలావరకు లవ్ మెసేజ్‌లు ఉన్నాయని పేర్కొంది. నేను వెంటనే ఆ నెంబర్ చెప్పాలని నా సోదరిని కోరాను.

    ఆమె నెంబర్ చెప్పిన తర్వాత నా స్నేహితుడి సాయంతో అది ఏ టవర్ పరిధిలో ఉందో తెలుసుకన్నాను. ఆ నంబర్ నా ఇంటికి సమీపంలోని టవర్ పరిధిలోనే ఉందని తెలిసి షాక్ అయ్యాను. ఇక, ఒక రోజు కవిత షాపింగ్ వెళ్లినప్పుడు ఆమె ఫోన్ గురించి వెతకడం ప్రారంభించాను. బాత్‌రూమ్‌లో కవిత దాచిన ఫోన్ కనిపించింది. అందులో నా సోదరి భర్తకు పంపిన అనేక సందేశాలు ఉన్నాయి. అందులో మెసేజ్‌లు చూసి నా గుండె ముక్కలైంది. దాంతో నేను కవిత నుంచి విడాకులు తీసుకున్నాను. అనంతరం నా జీవితంలోకి శిల్పాశెట్టి ప్రవేశించింది. నా గురించి శిల్పకు అన్ని తెలుసు’అని రాజ్‌కుంద్రా చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Bollywood news, Shilpa Shetty

    తదుపరి వార్తలు