సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వరుణ గండం.. భయపడుతున్న అభిమానులు..

సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ప్రణాళికతో సిద్ధం చేసారు దర్శక నిర్మాతలు. మొన్న సెప్టెంబర్ 18నే ఈవెంట్ ప్లాన్ చేసినా కూడా అది కుదర్లేదు. అధిక వర్షాలతో ఈవెంట్ ఐదు రోజులు వాయిదా వేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 22, 2019, 8:23 PM IST
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వరుణ గండం.. భయపడుతున్న అభిమానులు..
సైరా పోస్టర్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 22, 2019, 8:23 PM IST
సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ప్రణాళికతో సిద్ధం చేసారు దర్శక నిర్మాతలు. మొన్న సెప్టెంబర్ 18నే ఈవెంట్ ప్లాన్ చేసినా కూడా అది కుదర్లేదు. అధిక వర్షాలతో ఈవెంట్ ఐదు రోజులు వాయిదా వేసారు. అయితే ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుండటం ఇప్పుడు భయానకంగా మారిపోయింది. ఎల్బీ స్టేడియంలో ప్రస్తుతం సైరా ఈవెంట్ జరుగుతుంది. కానీ ఏ క్షణమైనా వర్షం పడే అవకాశం కూడా ఉండటంతో అటు ఈవెంట్ మేనేజర్స్‌తో పాటు ఇప్పుడు అభిమానులు.. మరోవైపు దర్శక నిర్మాతలు కూడా టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని వాతావరణం చూసి కంగారు పడుతున్నారు.


రెండేళ్ల తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఖైదీ నెం 150 సినిమా మంచి విజయం సాధించడంతో మెగాస్టార్ సైరాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. కచ్చితంగా సైరాతో మరో సంచలనం సృష్టించడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నాడని అభిమానులు కూడా నమ్మకంతో కనిపిస్తున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో వర్షం మాటిమాటికి అడ్డు వస్తుండటంతో ఫ్యాన్స్‌లో గుబులు రేగుతుంది. మొత్తానికి చూడాలిక.. అయ్యేలోపు పరిస్థితి ఎలా ఉండబోతుందో..?

First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...