జంటగా రాహుల్, పునర్నవి... అసలు విషం చెప్పిన బిగ్ బాస్ విన్నర్..

రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రాహుల్ తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి పరిచయమయ్యాడు.

news18-telugu
Updated: December 9, 2019, 3:05 PM IST
జంటగా రాహుల్, పునర్నవి... అసలు విషం చెప్పిన బిగ్ బాస్ విన్నర్..
Instagram/sipligunjrahul
  • Share this:
రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రాహుల్ తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి పరిచయమయ్యాడు. దీనికితోడు తన ఆటీట్యూడ్‌, పాటలతో అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మరోవైపు పునర్నవి కూడా బిగ్ బాస్ షోలో పాల్గొని యూత్‌లో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకుంది. హౌజ్‌లో ఉన్నంత సేపు రాహుల్ పునర్నవి మధ్యలో ఏదో జరుగుతుందని సోషల్ మీడియా కోడై కూసింది. అయితే అదంతా ఏమిలేదని రాహుల్, పునర్నవిలు చాలా సందర్బాల్లో స్పష్టం చేశారు. కాని రాహుల్‌కు బిగ్ బాస్ హౌజ్‌లో పున్ను చాలా సహాయం చేసిందని.. మోరల్ కాన్పిడెన్స్ ఇచ్చిందని రాహుల్ పలుమార్లు వివిధ సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మరో సారి రాహుల్ సోషల్ మీడియా వేదికగా జంటగా ఈ ఇద్దరు ఉన్న  ఓ ఫోటో షేర్ చేస్తూ నాకు హౌజ్‌లో ఎంతో హెల్ప్ చేసిందని.. ఎప్పటికి మరిచిపోని మెమోరీస్‌ను అందించిందని పేర్కోన్నాడు.  అది అలా ఉంటే రాహుల్‌కు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించి అవకాశం వచ్చింది. కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా వస్తోంది. 

View this post on Instagram
 

A stranger who became my real good friend and supported me in my entire journey of #bigboss3! ?‍♀️?‍♀️?‍♀️?‍♀️?‍♀️ @punarnavib you gave me memories to Cherish forever.....! ? Inka saalu theyyi Masthaindhi ega sallavadu Navi ?


A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on

చీరలో అందాలు ఆరబోసిన జాన్వీ కపూర్..
First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>