బిగ్ బాస్ బ్యూటీతో రాహుల్ సిప్లిగంజ్ లిప్ లాక్ వీడియో వైరల్..

Rahul Sipligunj: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయాడు. వరసగా పాటలు పాడుతూ దుమ్ము దులిపేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 15, 2020, 6:45 PM IST
బిగ్ బాస్ బ్యూటీతో రాహుల్ సిప్లిగంజ్ లిప్ లాక్ వీడియో వైరల్..
రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj)
  • Share this:
బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయాడు. వరసగా పాటలు పాడుతూ దుమ్ము దులిపేస్తున్నాడు. అలాగే మనోడు వివాదాల్లో కూడా బాగానే ఇరుక్కుంటున్నాడు. ఆ మధ్య ఓ అమ్మాయితో పబ్బుకు వెళ్లి రాహుల్ చేసిన రచ్చ అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆయన ఇంట్లోనే ఉన్నాడు కానీ మనోడు చేసిన మరో పని బయటికి వచ్చింది. బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్ నందిని రాయ్ అందరికి గుర్తుంది కదా.. ఆరేళ్ల కింద ఈమెతో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేసాడు ఈయన. అందులో భాగంగానే ఏకంగా లిప్ లాక్ సీన్ కూడా చేసి ఔరా అనిపించాడు.
రాహుల్ సిప్లిగంజ్ నందిని రాయ్ (rahul sipligunj nandini rai)
రాహుల్ సిప్లిగంజ్ నందిని రాయ్ (rahul sipligunj nandini rai)


తెలంగాణ యాసలో పాటలు పాడే రాహుల్‌కు యూ ట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటాడు. అందులో కొన్ని హీరోయిన్లతో కూడా నటించాడు రాహుల్. చిన్న చిన్న హీరోయిన్లతో ఈయన కూడా డాన్సులు చేస్తుంటాడు.. రొమాన్స్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా నందని రాయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్ చేసాడు రాహుల్. ఈ క్రమంలోనే తాజాగా నందినితో రొమాన్స్ వీడీయోని షేర్ చేసిన ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. దీనికి అషూ రెడ్డి చేసిన కామెంట్స్.. రాహుల్ సిప్లిగంజ్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నపుడు పునర్నవితో ప్రేమాయణం నడిపించాడు ఈయన. ఆమె కోసం ఏదైనా చేస్తానంటూ అప్పట్లో 20 గ్లాసుల కాకరకాయ్ జ్యూస్ కూడా తాగేసాడు. ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా పున్ను బేబీతో చాలా కాలం పాటు కలిసే ఉన్నాడు. ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు.. బయట కనిపించారు కూడా. ఇప్పుడు మాత్రం ఎవరి లైఫ్ వాళ్లదన్నట్లు ఉంటున్నారు. ప్రస్తుతం నటుడిగా కూడా లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు రాహుల్. సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండలో కీలక పాత్రలో నటిస్తున్నాడు రాహుల్.
రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)

ఈ క్రమంలోనే తన ప్రైవేట్ ఆల్బమ్‌లో నందిని రాయ్‌తో రొమాన్స్ చేస్తున్న వీడియోను విడుదల చేసాడు ఈ కుర్ర సింగర్. ఈ వీడియో కూడా ఇప్పుడు చేసింది కాదు.. ఆరేళ్ల కింద చేసిన ఎందుకే ప్రైవేట్ సాంగ్ ఇది. లిప్ లాక్ సీన్‌ను ఉద్దేశిస్తూ వావ్ ఇది నేను చూడలే అంటూ సెటైర్ వేసింది అశు రెడ్డి. దీనికి స్పందించిన రాహుల్.. అబ్బో ఇక నేను చచ్చిపోతా అంటూ కామెంట్ చేశాడు. మళ్లీ ప్రతీగా స్పందించిన అషూ.. మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌లో అంటూ నవ్వేసింది. ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ లిప్ లాక్ సీన్ వైరల్ అవుతుంది.
First published: April 15, 2020, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading