పునర్నవిని డేట్‌కు పిలిచిన రాహుల్.. ఆమె ఆన్సర్ విని షాక్..

Bigg Boss 3 | ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. విన్నర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

news18-telugu
Updated: November 5, 2019, 7:56 PM IST
పునర్నవిని డేట్‌కు పిలిచిన రాహుల్.. ఆమె ఆన్సర్ విని షాక్..
రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలం
  • Share this:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. వారిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో కలసిమెలసి ఉన్న తీరు అభిమానులకు బాగా నచ్చింది. ఫ్యాన్స్‌కే కాదు... ఏకంగా సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంది. అయితే, పునర్నవి జీవితంలో రాహుల్ సిప్లిగంజ్ కంటే ముందు మరోవ్యక్తి ఉన్నాడు. ఈ విషయం ఎవరో కాదు. సాక్షాత్తూ పునర్నవి భూపాలం రాహుల్ సిప్లిగంజ్‌కు చెప్పింది. పునర్నవి లైఫ్‌లో ఉన్న ఆ మరో వ్యక్తి గురించి స్వయంగా ఆమే తనకు చెప్పిందని రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆమెను తాను డేటింగ్ కోసం పిలిచినప్పుడు నిరాకరించిందన్నాడు. పునర్నవి అంటే తనకు గౌరవం ఉందని, తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. పునర్నవికి, తనకు మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదని స్పష్టం చేశాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్‌గా నిలిచాడు. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. విన్నర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చాలా మంది పేరున్న సెలబ్రిటీలు, అందాల ముద్దుగుమ్మలను కూడా ఢీకొట్టి ప్రజల మనసులు గెలుచుకుని విజేతగా నిలిచాడు.

సమస్య పరిష్కరిస్తారా?.. పెట్రోల్‌ సీసాతో రావాలా.. రైతు హెచ్చరికFirst published: November 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...