హోమ్ /వార్తలు /సినిమా /

Rahul Sipligunj: ఘనంగా ఐపిఎల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్ అయిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj: ఘనంగా ఐపిఎల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్ అయిన రాహుల్ సిప్లిగంజ్

IPL Pre Release event (Photo News 18)

IPL Pre Release event (Photo News 18)

IPL Movie Pre Release Event: అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఐపీఎల్ (IPL). ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఘనంగా ప్రి రిలీజ్ వేడుక నిర్వహించింది చిత్ర యూనిట్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై విశ్వ కార్తికేయ (Vishwa Karthikeya), శరణ్ (Sharan), అవంతిక (Avanthika), అర్చన గౌతమ్ (Archan Gautham) హీరో హీరోయిన్లుగా సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఐపీఎల్ (IPL). బీరం వరలక్ష్మి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతున్న సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రి రిలీజ్ వేడుక నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. ఈ వేడుకలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ.. ఈ నిర్మాత బిరం శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు.ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాను. హీరో విశ్వ కార్తికేయ, హీరో నితిన్ నాష్ ఇద్దరు జేమ్స్.. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది.వాళ్ళు పడిన కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది.అలాగే ఈ టీం చాలా కష్ట పడ్డారు..ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.

ఉదయ భాస్కర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా IPL ఎంత సక్సెస్ అయ్యిందో అంత సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను. విశ్వకార్తికేయ జాతీయ స్థాయి హీరో అవుతాడు.. నితిన్ నాష్ అద్భుతమైన నటుడు..సినిమా సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. .చిన్న సినిమాలు హిట్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. హీరో కార్తికేయ వాళ్ళ నాన్న రామాంజనేయులు నాకు మిత్రులు. కార్తికేయ నుంచి సినిమా సినిమా అంటూ ఎంతో కష్ట పడతాడు. త్వరలోనే మంచి స్టేజ్ కు వెళ్తాడు. ఇంకొక హీరో నితిన్ నాష్ బాగా నటించాడు. అవంతిక తెలుగమ్మాయి. ఆమెకు మంచి అవకాశాలు వస్తాయి..సినిమా మంచి సక్సెస్ అయ్యి నిర్మాతకు డబ్బులు టీమ్ కు మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను

రచ్చ రవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నటించాను ఈ టీం తో మంచి అనుబంధం ఉంది.కొత్తగా వచ్చే నిర్మాతలు సక్సెస్ ధ్యేయంగా కష్ట పడతారు. నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు అని అన్నారు. నిర్మాత బిరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా ipl సినిమా 10న రిలీజ్ అవుతుంది. మా సినిమాలో నటించిన నటి నటులు టెక్నీషియన్స్ సహకారం తో సినిమా బాగా వచ్చింది.మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్నారు.

రాహుల్ సిప్లి గాంజ్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో అన్న తమ్ముడు లేడు అన్ని వేంగి సుధాకర్ నాకు.అన్ని గైడ్ చేస్తూ ఉంటాడు. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వేంగి నే..ఈ సినిమా లో ఒక సాంగ్ పాడాను. పాటలు ఎంత హిట్ అయ్యాయి సినిమకూడా పెద్ద హిట్ కావాలి అన్నారు.

ఈ సినిమాలో విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అర్చన్ గౌతమ్, అవంతిక, హిరో హీరోయిన్లు....సుమన్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్, డిఎస్ రావు,అమిత్, మిర్చి మాధవి, కిన్నెర,,ఈరోజుల్లో సాయి, రచ్చ రవి, రామ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు