రాహుల్ సిప్లిగంజ్ పై పథకం ప్రకారమే దాడి జరిగిందా.. పాత కక్షలే కారణమా..

Rahul Sipligunj Attack | రాహుల్ సిప్లిగంజ్ పై పథకం .ప్రకారమే దాడి జరిగిందా ? దీనికి పాత కక్షలే కారణమా అంటే ఔననే అంటున్నారు రాహుల్ సిప్లిగంజ్ సన్నిహితులు.

news18-telugu
Updated: March 5, 2020, 8:08 AM IST
రాహుల్ సిప్లిగంజ్ పై పథకం ప్రకారమే దాడి జరిగిందా.. పాత కక్షలే కారణమా..
రాహుల్ సిప్లిగంజ్ (Source: Star Maa twitter)
  • Share this:
Rahul Sipligunj Attack | రాహుల్ సిప్లిగంజ్ పై పథకం .ప్రకారమే దాడి జరిగిందా ? దీనికి పాత కక్షలే కారణమా అంటే ఔననే అంటున్నారు రాహుల్ సిప్లిగంజ్ సన్నిహితులు. ఈయన తరుచుగా గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌కు వెళ్లే అలవాటు ఉంది. అక్కడ  రాహుల్‌కు అప్పట్లో అక్కడున్న కొంత మందితో కొంత కాలం క్రితం గొడవ జరిగిటనట్టు సమాచారం. అప్పట్లో  ఆ గొడవ సద్దుమణిగింది. అయితే.. గొడవ పడ్డవాళ్లు సమయం కోసం వేచి చూచారు. సరిగ్గా నిన్న రాత్రి.. రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి పబ్‌కు వచ్చాడు. ఇదే అదనుగా భావించిన వాళ్లు రాహుల్ సిప్లిగంజ్ వెంట ఉన్న అమ్మాయిని  టీజ్ చేసారు. దీంతో కోపోదిక్తుడైన రాహుల్.. వాళ్లను మందలించాడు. దీంతో మాటా మాటా పెరిగి అది కాస్తా రాహుల్‌ను బీర్ బాటిల్‌తో కొట్టే వరకు వెళ్లింది. దాడి జరిగిన తర్వాత పబ్ నిర్వాహకులు.. రాహుల్‌ను సమీపంలోని హాస్పటిల్‌కు తరలించారు. మరికొందరు మాత్రం రాహుల్.. గతంలో దాడి చేసిన వాళ్లతో ఒక ప్రోగ్రామ్ కోసం డబ్బులు తీసుకొని.. తీరా ఆ ప్రోగ్రామ్‌ను చేయకపోవడంతో వాళ్లు రాహుల్ తీరుపై గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో సమయం కోసం వేచి చూసి ఈ దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడి వెనక వికారాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే బంధువు ప్రమేయం ఉన్నట్టు సమాచారం. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రాహుల్ సిప్లిగంజ్.. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూర్చినట్టైంది.
First published: March 5, 2020, 8:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading