• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAHUL SIPLIGUNJ ATTACKED DUE TO HIS GIRL FRIEND HERE ARE THE DETAILS TA

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్‌పై దాడికి ఆ యువతే కారణమా..

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్‌పై దాడికి ఆ యువతే కారణమా..

రాహుల్ సిప్లిగంజ్ (Youtube/Photo)

Rahul Sipligunj Attack | రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జరగడానికి ఆయనతో ఉన్న యువతే కారణమా.. ? ఆమె వల్లే ఆయనపై దాడి జరిగిందా అంటే అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఔననే అంటున్నారు.

  • Share this:
    Rahul Sipligunj Attack | రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జరగడానికి ఆయనతో ఉన్న యువతే కారణమా.. ? ఆమె వల్లే ఆయనపై దాడి జరిగిందా అంటే అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు ఔననే అంటున్నారు. ఇంతకీ రాహుల్ సిప్లిగంజ్‌తో ఉన్న యువతి పునర్నవేనా లేకపోతే.. వేరే ఎవరితోనైాన గచ్చిబౌలిలోని ప్రిజమ్ బార్‌కు వెళ్లాడా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. పోలీసులతో పాటు మీడియా వాళ్లు తాజాగా జరిగిన ఈ ఘటనపై పునర్నవిని సంప్రదిస్తే.. ఆమె రెస్పాండ్ కావడం లేదని సమాచారం. దీంతో అతనితో ఉన్నది పునర్నవి కాదా అనేది ఎవరు సమాధానం చెప్పడం లేదు.  ఇక రాహుల్ ‌తో ఉన్న యువతితో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితులు అసభ్యంగా ప్రవర్తించడంతో రాహుల్ వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో మాటా మాటా పెరిగి రితేష్ రెడ్డి.. రాహుల్ పై బీరు బాటిల్లతో దాడి చేసాడు. దాడి జరిగిన తర్వాత పబ్ నిర్వాహకులు.. రాహుల్‌ను సమీపంలోని హాస్పటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత రాహుల్ తిరిగి తన ఇంటికీ వెళ్లిపోయాడు. 

    bigg boss 3 Winner Rahul sipligunj seriously injured in gachi bowli pub incident
    రాహుల్ సిప్లిగంజ్ (Instagram/sipligunjrahul)


    ఐతే.. రితేష్ రెడ్డి సన్నిహితులు మాత్రం రాహుల్ సిప్లిగంజ్.. తమతో వచ్చిన ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో మేము వద్దని వారించాము. కానీ అతను మా మాట వినకపోవడంతో పాటు మాపై దాడికి యత్నించడంతో మేము ఆత్మరక్షణలో భాగంగా అతనిపై దాడికి యత్నించినట్టు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ దాడి తర్వాత రాహుల్.. పోలీసులకు కంప్లైట్ ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఆ పబ్‌లో ఏం జరిగిందనే దానిపై ఎవరికీ వారు తమదైన వాదనలు వినిపిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎంత దూరం పోతుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: