Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ ఆర్మీ రెడీ...దుమ్ములేపేందుకు సిద్ధం

మూడో సీజన్ లో టైటిల్ కోసం హోరాహోరీగా తలపడుతున్న వారిలో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, అలీరెజా, శ్రీముఖి ఫాలోయర్ల వాయిస్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఓటింగ్ బేస్ పెంచడం కోసం వాళ్ల వాళ్ల ఫాలోయర్లు అన్ని రకాల టెక్నిక్కులను వాడేస్తున్నారు. ఇక చివరిగా ఆర్మీ రూపంలో రోడ్ల మీదకు వచ్చేసేందుకు సైతం సిద్ధమైపోతున్నారు.

news18-telugu
Updated: October 15, 2019, 9:28 PM IST
Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ ఆర్మీ రెడీ...దుమ్ములేపేందుకు సిద్ధం
రాహుల్ సిప్లిగంజ్ (Source: Star Maa twitter)
news18-telugu
Updated: October 15, 2019, 9:28 PM IST
బిగ్ బాస్ సీజన్ ఎండింగ్ కు వచ్చేసింది. ఇప్పటికే టైటిల్ విన్నర్‌ తమ అభిమాన కంటెస్టెంటే కావాలని సోషల్ మీడియాలో వాళ్ల మద్దతు దారులు పెద్దగా కాంపెయిన్ స్టార్ట్ చేసేశారు. గతంలో కౌషల్ ఆర్మీ పేరిట ఆన్ లైన్, ఆఫ్ లైన్ బృందం ఒకటి పుట్టుకొచ్చి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా హైదరాబాద్, వైజాగ్ లో కౌషల్ ఆర్మీ పేరిట 2కే రన్స్ సైతం నిర్వహించారు. ఈ రేంజులో కౌషల్ ఆర్మీ సక్సెస్ అయ్యింది. అయితే ఈ సారి మూడో సీజన్ బిగ్ బాస్ లో సైతం ఆర్మీల గొడవ ఉన్నప్పటికీ కంటెస్టెంట్స్ అందరికీ దాదాపు సమానమైన స్థాయిలోనే ఫాలోయర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడో సీజన్ లో టైటిల్ కోసం హోరాహోరీగా తలపడుతున్న వారిలో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, అలీరెజా, శ్రీముఖి ఫాలోయర్ల వాయిస్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఓటింగ్ బేస్ పెంచడం కోసం వాళ్ల వాళ్ల ఫాలోయర్లు అన్ని రకాల టెక్నిక్కులను వాడేస్తున్నారు. ఇక చివరిగా ఆర్మీ రూపంలో రోడ్ల మీదకు వచ్చేసేందుకు సైతం సిద్ధమైపోతున్నారు.

తాజాగా రాహుల్ సిప్లిగంజ్ పేరిట ఆర్మీ ఒకటి రంగంలోకి దిగింది. హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన రాహుల్ కు ఓల్డ్ సిటీనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని రాహుల్ ఆర్మీ స్థాపకులు సోను తెలిపారు. రాహుల్ యాటిట్యూడ్, అలాగే అతడిని అందరూ కార్నర్ చేస్తూ ఇబ్బంది చేయడం కూడా తమను ఆర్మీ ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం ఇచ్చిందని సోను తెలిపారు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...