పార్టీ చేసుకున్న రాహుల్, పునర్నవి.. రొమాంటిక్‌గా అదరగొట్టిన బిగ్‌బాస్ జోడి..

సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు.

news18-telugu
Updated: December 28, 2019, 10:15 AM IST
పార్టీ చేసుకున్న రాహుల్, పునర్నవి.. రొమాంటిక్‌గా అదరగొట్టిన బిగ్‌బాస్ జోడి..
Instagram/sipligunjrahul
  • Share this:
సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రాహుల్ తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దగ్గరైయాడు. మరోవైపు పునర్నవి కూడా బిగ్ బాస్ షోలో పాల్గొని యూత్‌లో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది. హౌజ్‌లో ఉన్నంత కాలం రాహుల్ పునర్నవి మధ్యలో ఏదో జరుగుతుందని సోషల్ మీడియా కోడై కూసింది. అయితే అదంతా ఏమిలేదని రాహుల్, పునర్నవిలు చాలా సందర్బాల్లో స్పష్టం చేశారు. కాగ ఈ జంట మరోసారి ఓ పార్టీలో అలరించింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ రంగమార్తండలో ప్రముఖ నడుటు ప్రకాష్ రాజ్, ప్రముఖ నటి రమ్యకృష్ణ, బ్రహ్మనందంతో పాటు రాహుల్ కూడా నటిస్తున్నాడు. రాహుల్‌కుజోడిగా శివాత్మిక రాజశేఖర్ నటిస్తోంది. అది అలా ఉంటే రంగమార్తండ టీమ్ జాలీగా నిన్న నైట్ పార్టీ చేసుకుంది.  ఆ పార్టీలో బిగ్ బాస్ జంట రాహుల్ అండ్ పునర్నవి అదరగొట్టారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో రాహుల్ పాడుతుండగా.. పున్ను ఇరగదీసింది. జంటగా ఈ ఇద్దరూ రొమాంటిక్‌గా డాన్స్ చేశారు. దానికి సంబందించిన ఓ వీడియోను రాహుల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


View this post on Instagram

Memorable Evening!😊 @awm_band Thank you so much for being so wonderful. We really enjoyed😊


A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on
Published by: Suresh Rachamalla
First published: December 28, 2019, 10:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading