RAHUL SIPLIGUNJ ABOUT KRISHNA VAMSI RANGAMARTHANDA SHOOT SHARES A PHOTO GOES VIRAL SR
Krishna Vamsi | Rangamarthanda : రంగ మార్తాండ షూటింగ్ అప్ డేట్.. ఫోటో షేర్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..
Rangamarthanda Photo : Instagram
Krishna Vamsi | Rangamarthanda : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ( Krishna Vamsi) చాలా కాలం తర్వాత ‘రంగమార్తాండ’ అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈరోజుతో షూటింగ్‌ను పూర్తి చేసుకుందట
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ( Krishna Vamsi) చాలా కాలం తర్వాత ‘రంగమార్తాండ’ అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో తన షూటింగ్ పూర్తి అయ్యిందట. దీనికి సంబంధించి రాహుల్ సిప్లీగంజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఈరోజుతో రంగ మార్తండ షూటింగ్ ముగిసిందని అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, పోనీ వర్మ, అలీ రేజా ఉన్నారు. ఇక అది అలా ఉంటే ఈ చిత్రానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాయిస్ ఓవర్‌ను ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో సినిమాపై మరింత క్రేజ్ రానుందని చిత్రబృందం భావిస్తోంది. ఇక ఇదే విషయాన్నే తెలుపుతూ “తన మెగా వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవి థాంక్స్ చెబుతున్నాని” కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా ఆ మధ్య పోస్ట్ చేశారు. రంగమార్తండ (Rangamarthanda)లో వర్సటైల్ యాక్టర్ రమ్యకృష్ణ కీలకపాత్రలో కనిపించనున్నారు. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణి (Ramya Krishna) రమ్యకృష్ణను డైరెక్ట్ చేస్తున్నారు. దీనికి తోడు సరైనా విజయాలు లేక సతమతమవుతోన్న కృష్ణంశీ నుంచి చాలా కాలం తర్వాత ఓ సినిమా వస్తుండడంతో మంచి అంచనాలు ఉన్నాయి.
కృష్ణవంశీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఓ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకు సరైన హిట్ లేదు. రామ్ చరణ్‌తో తీసిన గోవిందుడు అందరివాడేలే పరవాలేదనిపించింది. ఈ తాజా సినిమా నటసామ్రాట్ అనే మరాఠి క్లాసిక్ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. కృష్ణవంశీ చిత్రాన్ని అన్ని విధాలా గొప్పగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రఖ్యాత సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల విషయానికి వస్తే... ఒరిజినల్ చిత్రం నటసామ్రాట్‌లో నానా పాటేకర్ పోషించిన పాత్రని వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మనందం కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మరో పాత్రలో జబర్దస్త్ యాంకర్ అనసూయని (Anchor Anasuya) నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ.
అంతేకాదు ఈ సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేకపాటలో అనసూయ నటించాల్సి ఉంటుందట. అనసూయ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రానుందట. ఆ విధంగా కృష్ణవంశీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె శివాత్మిక నటిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాల ఇలా ఉండగానే కృష్ణవంశీ మరో సినిమాను ప్రకటించారు. అన్నం.. పరబ్రహ్మస్వరూపం అనే టైటిల్‌తో కృష్ణవంశీ కొత్తం చిత్రం రూపొందనుంది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను, మూవీ పోస్టర్‌ను కృష్ణ వంశీ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.