Bigg Boss 3: బిగ్‌బాస్ 3 ఫైనల్ విజేత రాహుల్..

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగిసింది. ఈ రోజు జరిగిన ఫైనల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారనే విషయమై ఉత్కంఠ కొనసాగింది. ఫైనల్‌గా

news18-telugu
Updated: November 3, 2019, 10:50 PM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ 3 ఫైనల్ విజేత రాహుల్..
బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ (Image: Star MAA)
  • Share this:
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగిసింది. ఈ రోజు జరిగిన ఫైనల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారనే విషయమై ఉత్కంఠ కొనసాగింది. బిగ్‌బాస్ 3 ఫైనల్‌ కోసం పెద్ద పెద్ద హీరోయిన్స్‌తో స్పెషల్ డాన్స్ షోలు ఏర్పాటు చేసింది స్టార్ మా నిర్వాహాకులు. ఇప్పటికే కేథరిన్, అంజలి ఈ షోలో తమ డాన్సులతో ఈ షోకు జోష్ తీసుకొచ్చారు. ముందుగా మారుతి, అంజలి హౌస్‌లో వెళ్లి అలీ రెెజాను హౌస్‌ బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీకాంత్ హౌస్‌ మేట్స్ కి రూ.10 లక్షల ఆశ చూపెట్టాడు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ రూమ్‌లోకి వెళ్లి మరో రూ.20 లక్షలు తీసుకొచ్చాడు. కానీ ఎవరు టెంప్ట్ కాలేదు.  శ్రీకాంత్, కాథరీన్ కలిసి  టాప్4లో ఉన్న వరుణ్ సందేశ్‌ను హౌస్ బయటకు  తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు కాస్తంత భావోద్వేగానికి గురయ్యాడు. వరుణ్ సందేశ్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 3లో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ నిలిచారు.  ఆ తర్వాత అంజలి హౌస్‌ లోపలి వెళ్లింది. బిగ్‌బాస్ మొదట హౌస్ నుండి స్వచ్ఛందంగా బయటకు వెళ్లే వారికి రూ. 10 లక్షల ఆఫర్ ప్రకటించాడు. ఆ తర్వాత రూ.25 లక్షలు ప్రకటించాడు. అయినా ఎవరు ఈ ఆఫర్‌కు స్పందించలేదు. ఆ తర్వాత అంజలి బాబా భాస్కర్‌ను హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తున్నట్టు  ప్రకటించింది. చివరగా ఫైనల్‌లో శ్రీముఖి, రాహుల్ నిలిచారు. చివరగా మెగాస్టార్ చిరంజీవి ఈ  ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసారు. చిరంజీవికి నాగార్జున పూల బోకే తో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అనేది ప్రపంచంలో అతిపెద్ద రియాలిటీ షో అని పేర్కొన్నారు. తాజాగా  బిగ్‌బాస్ 3  హోస్ట్ అయిన నాగార్జున.. హౌస్‌లో ప్రవేశించి ఫైనల్‌లో నిలిచిన  శ్రీముఖి, రాహుల్ ‌ఇద్దరికీ  ఒక ఆఫర్ ప్రకటించాడు. ఫైనల్‌గా శ్రీముఖి, రాహుల్‌ను  స్టేజ్ మీదికి తీసుకొచ్చి..బిగ్‌బాస్ 3 విజేతగా రాహుల్‌ నిలిచినట్టు నాగార్జున సమక్షంలో చిరంజీవి ప్రకటించారు. 

 

First published: November 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు