పిచ్చి వేషాలు వేయొద్దు...ఒళ్లు దగ్గరపెట్టుకో...స్టేజ్ పైనే పునర్నవి ఫైర్...షాక్‌లో రాహుల్...

షోలో వచ్చిన పార్టిసిపెంట్స్ పునర్నవిని ఓ రేంజులో ఆడుకున్నారు. ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని, రాహుల్ వెనుక పునర్నవి ఉంది అంటూ ఆటపట్టించారు. దీంతో ఒక రేంజ్ వరకూ ఓపిక పట్టిన పునర్నవి కాసేపటి తర్వాత పేషన్స్ కోల్పోయింది. ఇంకే ముందు నోటి వెంట బూతు పురాణం మొదలైపోయింది.

news18-telugu
Updated: November 17, 2019, 7:18 PM IST
పిచ్చి వేషాలు వేయొద్దు...ఒళ్లు దగ్గరపెట్టుకో...స్టేజ్ పైనే పునర్నవి ఫైర్...షాక్‌లో రాహుల్...
(Image: Punarnavi Bhupalam / instagram)
  • Share this:
బిగ్ బాస్ షో తర్వాత వచ్చిన క్రేజ్ తో పునర్నవి, రాహుల్ ఇద్దరూ అన్ని టీవీ స్టూడియోలు చుట్టేస్తున్నారు. ఏ ప్రోగ్రాంలో చూసిన వీరిద్దరే చీఫ్ గెస్టులు, అటు యూట్యూబ్ సోషల్ మీడియాలో కూడా వీరిద్దరే హాట్ టాపిక్.. తాజాగా స్టార్ మా వాళ్లు నిర్వహిస్తున్న, స్టార్ మా పరివార్ లీగ్ షోలో ముఖ్య అతిథిగా పునర్నవి హాజరైంది. అక్కడ షోలో వచ్చిన పార్టిసిపెంట్స్ పునర్నవిని ఓ రేంజులో ఆడుకున్నారు. ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని, రాహుల్ వెనుక పునర్నవి ఉంది అంటూ ఆటపట్టించారు. దీంతో ఒక రేంజ్ వరకూ ఓపిక పట్టిన పునర్నవి కాసేపటి తర్వాత పేషన్స్ కోల్పోయింది. ఇంకే ముందు నోటి వెంట బూతు పురాణం మొదలైపోయింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. లంగ లెక్కలు వేయొద్దు అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. అలాగే ఒళ్లు దగ్గరపెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చేసింది. అయితే ఇదే ఎపిసోడ్ లో రాహుల్ సైతం గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...