Kriti Garg Kidnap: కిడ్నాప్ ఉదంతంపై హీరోయిన్ కృతి గార్గ్ క్లారిటీ..

ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందంటూ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫోన్ చేయడంతో ముంబై వెళ్లిన రాహు సినిమా ఫేమ్ కృతి గార్గ్.. అక్కడ కిడ్నాప్ గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ కిడ్నాప్ ఉదంతంపై హీరోయిన్ కృతి గార్గ్ వివరణ ఇచ్చింది.

news18-telugu
Updated: March 2, 2020, 7:20 PM IST
Kriti Garg Kidnap: కిడ్నాప్ ఉదంతంపై హీరోయిన్ కృతి గార్గ్ క్లారిటీ..
ప్రభాస్,కృతి గార్గ్,సందీప్ రెడ్డి వంగా (Twitter/Photos)
  • Share this:
ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందంటూ.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఫోన్ చేయడంతో ముంబై వెళ్లిన రాహు సినిమా ఫేమ్ కృతి గార్గ్.. అక్కడ కిడ్నాప్ గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనిపై టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది. దీనిపై రాహు సినిమా ఫేమ్ సుబ్బు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ కిడ్నాప్ ఉదంతంపై హీరోయిన్ కృతి గార్గ్ వివరణ ఇచ్చింది. నేను ముంబైకు ఈ ఉదయమే ఫ్లైట్‌లో వచ్చాను. ఆ తర్వాత అలసీ పోయి ముంబైలో ఉన్న ఇంటికి వెళ్లినట్టు వివరణ ఇచ్చింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మరిచిపోవడంతో స్వి,చ్ఛాఫ్ అయింది అంటూ వివరణ ఇచ్చింది. కృతి గార్గ్ విషయానికొస్తే.. ఈమె యాక్ట్ చేసిన రాహు సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా హీరోయిన్ కృతి గార్గ్‌తో పాటు దర్శకుడు సుబ్బు కావాలనే ప్రభాస్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటూ ఈ కిడ్నాప్ డ్రామా ఆడారా అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఈ కిడ్నాప్ ఉదంతంతో హీరోయిన్‌గా కృతి గార్గ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Published by: Kiran Kumar Thanjavur
First published: March 2, 2020, 7:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading