Home /News /movies /

RAGHAVENDRA RAO EX DAUGHTER IN LAW KANIKA DHILLON SECOND MARRIAGE PHOTOS GOING VIRAL PK

Kanika Dhillon second marriage: రాఘవేంద్రరావు మాజీ కోడలు రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్..

కనిక థిల్లన్, హిమన్షు శర్మ పెళ్లి (Kanika Dhillon Himanshu Sharma)

కనిక థిల్లన్, హిమన్షు శర్మ పెళ్లి (Kanika Dhillon Himanshu Sharma)

Kanika Dhillon second marriage: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు కనిక ధిల్లన్ రెండో పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల కింద రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడిని పెళ్లి చేసుకుంది బాలీవుడ్ స్టోరీ రైటర్ కనికా ధిల్లాన్‌. ఈ ఇద్దరూ కలిసి అనుష్క హీరోయిన్‌గా..

ఇంకా చదవండి ...
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు కనిక ధిల్లన్ రెండో పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల కింద రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడిని పెళ్లి చేసుకుంది బాలీవుడ్ స్టోరీ రైటర్ కనికా ధిల్లాన్‌. ఈ ఇద్దరూ కలిసి అనుష్క హీరోయిన్‌గా నటించిన సైజ్ జీరో సినిమాకు కలిసి పని చేసారు కూడా. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీళ్ల దాంపత్యం బాగానే సాగినా కూడా ఆ తర్వాత మాత్రం మనస్పర్థలు వచ్చాయి. దాంతో విడాకులు తీసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు కనిక, ప్రకాశ్. ఆ తర్వాత ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీ అయిపోయారు. బాలీవుడ్‌లోనూ ప్రకాశ్ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు కనిక కూడా కథలు రాస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్క్రీన్ రైటర్ హిమాన్షు శర్మతో ప్రేమలో పడింది కనిక. ఇప్పుడు ఈయన్నే రెండో వివాహం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. కరోనా కారణంగా పెద్దగా సందడి లేకుండానే ఈ పెళ్లి జరిగింది. సన్నిహితులు వచ్చి నూతన వధూవరులని ఆశీర్వదించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలను కనికా ధిల్లన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

కొత్త సంవత్సరంలో కొత్త ప్రయాణం అని కామెంట్ పెట్టింది. కనిక, హిమాన్షు శర్మ ఏడాదిగా డేటింగ్ చేస్తున్నారు. పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు అనుకున్నట్లుగానే ఏడడుగులు నడిచారు. అక్షయ్ కుమార్ అత్రాంగీ రే సినిమాతో బిజీగా ఉన్నాడు హిమన్షు. మరోవైపు తాప్సీ హసీన్ దిల్‌రూబా, రాజ్‌కుమార్ హిరానీ తదుపరి సినిమాలకు పని చేస్తుంది కనిక ధిల్లన్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: K. Raghavendra Rao, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు