Home /News /movies /

RAGHAVENDRA RAO EX DAUGHTER IN LAW KANIKA DHILLON ENGAGED TO HIMANSHU SHARMA MNJ

Kanika Dhillon:‌ టాలీవుడ్‌ ద‌ర్శ‌కుడి మాజీ భార్య రెండో పెళ్లి‌.. జాతీయ అవార్డు గ్ర‌హీత‌తో ఎంగేజ్‌మెంట్

క‌నికా దిల్లోన్

క‌నికా దిల్లోన్

క‌నికా దిల్లోన్.. ఈ పేరు చెప్పిన వెంట‌నే అంద‌రూ ఇట్టే గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు. కానీ మూవీ ల‌వ‌ర్స్ అయితే ఈ పేరును గుర్తుప‌ట్టేస్తారు. ర‌చ‌యిత‌గా హిందీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నారు క‌నికా

    Kanika Dhillon : క‌నికా దిల్లోన్.. ఈ పేరు చెప్పిన వెంట‌నే అంద‌రూ ఇట్టే గుర్తుప‌ట్ట‌క‌పోవ‌చ్చు. కానీ మూవీ ల‌వ‌ర్స్ అయితే ఈ పేరును గుర్తుప‌ట్టేస్తారు. ర‌చ‌యిత‌గా హిందీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నారు క‌నికా. మ‌రి హిందీలో అయితే మ‌న‌కేం తెలుస్తుంది అనుకోకండి. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌కత్వం వ‌హించిన సైజ్ జీరో సినిమాకు క‌నికానే క‌థ‌ను అందించారు. అప్పుడు జ‌రిగిన ప్ర‌మోష‌న్‌ల‌లో క‌నికా అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యారు.

    కాగా ఈ మూవీ కంటే ముందే 2014లో ప్ర‌కాష్‌, క‌నికా ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ వీరి వైవాహిక జీవితం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. 2017లో వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. ఈ విష‌యం చాలా రోజుల త‌రువాత క‌నికానే అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌కాష్‌తో విడాకులు తీసుకున్నాన‌ని.. కానీ తామిద్ద‌రం ఇప్ప‌టికీ మంచి స్నేహితుల‌మ‌ని ఆమె ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు. అంతేకాదు గ‌తేడాది హిందీలో ప్ర‌కాష్ తెర‌కెక్కించిన జ‌డ్జిమెంట్ హై క్యా అనే చిత్రానికి క‌నికానే స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం.



    అయితే ఈ ర‌చ‌యిత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. జాతీయ అవార్డు గ్ర‌హీత, ర‌చ‌యిత హిమాన్షు శ‌ర్మ‌ను క‌నికా వివాహం చేసుకోనున్నారు. వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ ఆదివారం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో జ‌రిగింది. ఇక ఆ ఫొటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన క‌నికా.. ఎంగేజ్‌మెంట్ అయిన‌ట్లు వెల్ల‌డించింది. త్వ‌ర‌లోనే త‌మ వివాహం జ‌ర‌గ‌బోతున్న‌ట్లు వీరిద్ద‌రు ప్ర‌క‌టించారు. కాగా ప్ర‌స్తుతం హిమాన్షు అక్ష‌య్ కుమార్, ధ‌నుష్, సారా అలీ ఖాన్ న‌టిస్తోన్న అంత‌రంగి రే మూవీకి ప‌నిచేస్తుండ‌గా.. తాప్సీ న‌టిస్తోన్న హ‌సీన్ దిల్‌రుబా మూవీకి క‌నికా ప‌నిచేస్తున్నారు.
    Published by:Manjula S
    First published:

    Tags: K. Raghavendra Rao, Prakash Kovelamudi, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు