Home /News /movies /

RAGHAVENDRA RAO ANNOUNCES HEROINE FOR ROSHAN PELLI SANDAD MOVIE MNJ

Pelli SandaD: పెళ్లి సందD హీరోయిన్ ఖరారు.. రోషన్ పక్కన నటించబోయేది ఈ బ్యూటీనే

పెళ్లి సందD రోషన్

పెళ్లి సందD రోషన్

దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌రువాత దర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు(Raghavendra Rao) త‌న త‌దుపరి సినిమాను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 1996లో శ్రీకాంత్‌ హీరోగా ద‌ర్శ‌కేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి(Pelli Sandadi) సీక్వెల్ పెళ్లి సందD(Pelli SandaD)కి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌నున్నారు. ఇక ఈ మూవీకి గౌరీ రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. శ్రీకాంత్(Srikanth) త‌న‌యుడు రోషన్(Roshan) ఇందులో న‌టిస్తున్నారు

ఇంకా చదవండి ...
    Pelli SandaD: దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌రువాత దర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న త‌దుపరి సినిమాను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 1996లో శ్రీకాంత్‌ హీరోగా ద‌ర్శ‌కేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి సీక్వెల్ పెళ్లి సందDకి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌నున్నారు. ఇక ఈ మూవీకి గౌరీ రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. శ్రీకాంత్ త‌న‌యుడు రోషన్ ఇందులో న‌టిస్తున్నారు. కె కృష్ణ మోహన్ రావు, ఆర్కా మీడియా వర్క్ ఈ మూవీని సమర్పిస్తుండగా.. ఆర్కే ఫిలిం అసోసియేషన్ నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాగా.. ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌గా ప‌లువురి పేర్లు వినిపించాయి. దివంగ‌త న‌టి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ క‌పూర్‌ని కూడా ఈ మూవీ కోసం సంప్ర‌దిస్తున్న‌ట్లు టాక్ న‌డిచింది. అంతేకాదు మ‌ల‌యాళ కుట్టీ మాల‌వికా నాయ‌ర్ పేరు కూడా ఈ సీక్వెల్ కోసం వినిపించింది. ఇక తాజాగా హీరోయిన్ పేరును ప్ర‌క‌టించారు రాఘ‌వేంద్ర‌రావు. ఇందులో శ్రీ లీల హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు.

    ఈ పాతికేళ్ల పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి పెళ్లిసందD సినిమాని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం. త్వరలో థియేటర్లో కలుద్దాం అని రాఘ‌వేంద్ర‌రావు ట్వీట్ చేశారు.



    కాగా అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీ లీల.. కిస్ అనే క‌న్న‌డ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ విడుద‌ల అవ్వ‌కుండానే శ్రీముర‌ళి న‌టిస్తోన్న భార‌తే అనే మూవీలో అవ‌కాశం సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పెళ్లిసందDతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. కాగా ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతుంది. నిర్మ‌లా కాన్వెంట్‌తో హీరోగా ప‌రిచ‌యం అయిన రోష‌న్‌.. ఈ మూవీతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకోవాల‌ని భావిస్తున్నాడు.
    Published by:Manjula S
    First published:

    Tags: K. Raghavendra Rao, Pelli SandaD, Roshan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు